మొన్న కర్ణాటక లో "కర్ణాటక మిల్క్ ఫెడరేషన్" ను "గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్" ను విలీనం చేయాలనీ ప్రయత్నాలు చేసింది బిజెపి ప్రభుత్వం. కానీ అక్కడ ప్రతిపక్షాలు, రైతులు నుండి తీవ్ర నిరసన రావడం తో వెనక్కి తగ్గింది. ఇప్పుడు తమిళనాడు వంతు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు కేంద్ర మంత్రి అమితాషా కు లేఖ రాశారు. తమిళనాడు లో అమూల్ పాల సేకరణ వలన తలెత్తుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు. అసలు ఈ అమూల్ వివాదం ఏంటి? అనేది తెలుసుకోవాలి అంటే మనము ముందుగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో అమిత్ షా చేసిన ప్రకటన తెలుసుకోవాలి. కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మొదటి మంత్రి అమిత్ షా “అమూల్ (గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్) ను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కలిసి కర్నాటకలోని ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక డెయిరీని నెలకొల్పేందుకు కృషి చేస్తాయని ప్రకటించడంతో వివాదం మొదలైంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని పేరుతో పాలను విక్రయస్తుంది. అమూల్ ను నందిని తో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కర్ణాటక లో ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా
తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. జూన్ 2 వతేది నుండి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపోందించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాలలో సాధించిన ప్రగతి ని పల్లె పల్లె లో ప్రజలను భాగస్వాములు చేస్తూ సంబురాలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఈ తొమ్మిది ఏండ్ల లో సాధించిన ప్రగతి కి చిహ్నం గా ఈ దశాబ్ది ఉత్సవాలు ఉండనున్నాయి. ఒక పక్క ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కు ఏర్పాట్లు చేస్తుంటే ప్రతి పక్షాలు మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాలు వలన భారత రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అని, ప్రజాధనం వృధా అయిపోతుంది అని విమర్శలు చేస్తూ ఉంది. ఆత్మగౌరవానికి కోసం ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదవ వసంతం లోకి అడుగుపెడుతున్న వేళ సంబురాలు చేసుకోవడం తప్పేముంది. ఒకవేళ ఈ సంబురాలు వలన భారతీయ రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అనుకుంటే అది ఎందుకు చేకూరుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ దశాబ్ది ఉత్సవాలా