నాగార్జున సినిమా బంగార్రాజు ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన నాగ చైతన్య

 నాగార్జున  ఆగస్టు 29 న తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున నాగ చైతన్య తన తండ్రి నాగార్జున తన రాబోయే చిత్రం బంగార్రాజు నుండి కొత్త  లుక్‌ను  ట్విట్టర్‌ ద్వారా ఆవిష్కరించారు.  నాగచైతన్య  తన

తండ్రి నాగార్జునకు అందమైన పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా ట్వీట్ చేసాడు.  తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కలిసి ఈ 62 వ పుట్టిన  రోజును జరుపుకోనున్నారు.  

ప్రముఖుల శుభాకాంక్షలు


అక్కినేని నాగార్జునకు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది.  ఆయన కోడలు సమంత, చిరంజీవి మరియు ప్రముఖులు ట్విట్టర్‌లో అక్కినేని నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు.

బంగార్రాజు నుండి నాగార్జున లుక్‌ను నాగ చైతన్య ఆవిష్కరించారు.  పోస్ట్‌ని షేర్ చేస్తూ, నాగ చైతన్య ఇలా వ్రాశారు, "నా రాజు @iamagarjuna కి పుట్టినరోజు శుభాకాంక్షలు ..    మీతో  స్క్రీన్ పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను! ఎల్లప్పుడూ  మీరు ఆరోగ్యం గా , సంతోషం గా ఉండాలని  కోరుకుంటున్నాను . "

బంగార్రాజు గురించి 


కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన బంగార్రాజు 2016 లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి  కొనసాగింపు  అని సమాచారం.  నాగార్జున మరియు నాగ చైతన్య ఈ చిత్రం లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.  ఆగస్ట్ 20 న, ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

విక్రమ్ కుమార్ చిత్రం తర్వాత తండ్రీ కొడుకులు తెరపై చేస్తున్న రెండో సినిమా ఇది.  ఈ చిత్రంలో కృతి శెట్టి మరియు రమ్య కృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించనున్నారు.  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు. 
బంగార్రాజు చిత్రం గురించి నాగార్జున  అభిమానులు ఎదురు చూస్తున్నారు.Comments