వ్యక్తిగత రుణాలు పొందడానికి 9 చిట్కాలు

నేటి రోజుల్లో అన్ని బ్యాంక్ లు వ్యక్తి గత రుణాలు (PERSONAL LOANS) జారీ చేస్తున్నాయి. మన అవసరాలను ఈ రుణాలు ఆదుకుంటాయి. ఐతే ఒక బ్యాంక్ నుండి త్వరిత గతిని వ్యక్తిగత రుణం పొందాలి అంటే ఏమి చేయాలి ? మీరు వ్యక్తి గత రుణాలు తీసుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ను ఆర్ధిక నిపుణులు తెలియజేస్తున్నారు.  
  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి:

 ఎప్పుడైనా కానీ వ్యక్తిగత రుణాన్ని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. నేడు అన్ని బ్యాంక్ లు తమ బ్యాంక్ వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత రుణ వివరాలు పొందుపరిచి, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం మీ వ్యక్తిగత రుణ దరఖాస్తు త్వరిత గతిని ఆమోదించబడుతుంది. ఆయా బాంక్ ల యొక్క శాఖని దర్శించడం కంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం వలన మీ సమయం ఆదా అవుతుంది. 
 

 2. మీ క్రెడిట్ స్కోర్‌ను ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడండి

 వ్యక్తిగత రుణం అనేది అసురక్షిత రుణం. అందువలన మీకు వ్యక్తిగత రుణం జారీ చేసే ఆర్ధిక సంస్థలు మీ క్రెడిట్ స్క్రోర్ ను  చూసి మీకు రుణాన్ని అందిస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటే ఆర్ధిక సంస్థలు మీ పై విశ్వాసం ఉంచి రుణాన్ని మంజూరు చేస్తాయి. అందువలన ఎల్లప్పుడూ మీ క్రెడిట్ స్క్రోర్ ఎక్కువ గా ఉంచుకోవడానికే ప్రయత్నం చేయాలి. మీ క్రెడిట్ స్కోర్ 750 పైన ఉంటే మీ వ్యక్తిగత రుణ దరఖాస్తు త్వరిత గతిన ఆమోదం పొందుతుంది. 


3. ఒక రుణదాతను ఎంచుకోండి మరియు దరఖాస్తు చేయండి:

 మీరు వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసేటప్పుడు ఎక్కువ ఆర్ధిక సంస్థలు కు దరఖాస్తు చేయకండి. దీని వలన మీ సమయం వృధా అవుతుంది. మీరు ఎన్ని సంస్థలకు ఋణ దరఖాస్తు చేసేరు అనేది మీ క్రెడిట్ స్కోర్ లో కనపడుతుంది. దీనివలన మీరు ఎక్కువ సంస్థలకు దరఖాస్తు  చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రతి కూల ప్రభావం చూపవచ్చు. 

 4. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కొనసాగిస్తూ ఉండండి:

 బ్యాంక్  లు మీ బాంక్ బాలన్స్ ను బట్టి మీ దరఖాస్తు పై ఒక అభిప్రాయానికి వస్తాయి. మంచి బ్యాంక్ బాలన్స్ మీరు కొనసాగిస్తున్నట్టు ఐతే మీ మీ రుణం చెల్లించే సామర్ధ్యం  మీకు ఉందని బ్యాంక్. లు  బావిస్తాయి. తద్వారా మీకు రుణం త్వరిత గతిని మంజూరు చేయబడుతుంది. 

 5. అన్ని ఆదాయ వనరులను చూపించండి

 దరఖాస్తు చేసేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల ఆదాయ మార్గాలు ను తప్పనిసరిగా చూపించండి. కొన్నిసార్లు, ఒక మూలం నుండి వచ్చే ఆదాయం మీకు రుణం పొందడానికి సరిపోకపోవచ్చు.  మీరు అన్ని ఆదాయ వనరులను చూపించారని నిర్ధారించుకోవడం వలన మీరు లోన్‌ను వేగంగా  పొందగలరు. 

 6. మీ రుణం-ఆదాయ నిష్పత్తి తక్కువగా ఉంచండి:

 రుణం-ఆదాయ నిష్పత్తి అంటే మీ ఆదాయానికి EMIల నిష్పత్తి.  ఈ నిష్పత్తి 45% కంటే ఎక్కువగా ఉంటే సమస్యలు ఉండవచ్చు, దీనివలన మీ రుణ దరఖాస్తు ఆలస్యం కావచ్చు. 7. అడిగిన దానికంటే ఎక్కువ పత్రాలు ఇవ్వండి:

 చాలా మంది రుణదాతలు లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు వారు అడిగే పత్రాలను జాబితా మాత్రమే ఇస్తారు.   అడిగిన దానికంటే ఎక్కువ సమర్పించడం వలన రుణదాత మీ దరఖాస్తును త్వరగా మూల్యాంకనం చేయడం మరియు రుణాన్ని ఆమోదించడం సులభం చేస్తుంది.

 8. రుణదాతతో సంబంధాన్ని ప్రదర్శించండి:

 మీరు బ్యాంక్ లేదా NBFC వద్ద దరఖాస్తు చేసినా, మీరు గతంలో కస్టమర్‌గా ఉన్నారని రుణదాతకు చూపించి, లోన్ ఆమోదం పొందే అవకాశాలను పెంచుకోవచ్చు.  మీరు రుణదాత వద్ద ఇప్పటికే రుణ ఖాతాను కలిగి ఉండవచ్చు లేదా వారి ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

 9. నిర్ణయాత్మకంగా ఉండండి:

 మీరు రుణదాత నుండి ఆఫర్‌ను పొందిన తర్వాత, మీరు ఒప్పంద ఒప్పందాన్ని నిర్ణయించి, సంతకం చేశారని నిర్ధారించుకోండి.  ఇది త్వరిత పంపిణీకి సహాయపడుతుంది.  మీరు ఇప్పటికే మీకు నచ్చిన ఆఫర్‌ను పొందినట్లయితే, మెరుగైన ఆఫర్‌ల కోసం ఇక వెతకవద్దు. 
 
 వ్యక్తిగత రుణం అనేది త్వరిత ఆమోదం రుణదాతపైనే కాకుండా దరఖాస్తుదారుపై కూడా ఆధారపడి ఉంటుంది.  మీరు పైన పేర్కొన్న కొన్ని చిట్కాలను పాటిస్తే, లోన్ అప్లికేషన్ వేగంగా జరగడమే కాకుండా, రుణదాత నుండి త్వరగా సానుకూల ప్రతిస్పందనను పొందవచ్చు. అంతే కాదు మీరు తక్కువ వడ్డీ ధర లోను వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. 


- భద్రిరాజు తటవర్తి 

Post a Comment

Previous Post Next Post