క్రెడిట్ ట్రాప్ లో పడకండి


క్రెడిట్ కార్డ్ ల వలలో పడకండి

ఆఫర్స్ తో ఊరిస్తూ అప్పుల ఊబిలో నెట్టేస్తున్న క్రెడిట్ కార్డ్స్  


క్రెడిట్ కార్డ్ లు ఊరిస్తాయి. రివార్డ్ పాయింట్స్ , డిస్కౌంట్స్ అని ఆశ చూపుతాయి. క్రెడిట్ కార్డ్ ల గురించి పూర్తి గా తెలుసుకోకుండా తీసుకుంటే ఏమవుతుంది ?  ఆర్ధిక నిపుణులు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి ? 

 తటవర్తి భద్రిరాజు అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. 


మీ క్రెడిట్  స్కోర్ బావుంది. మీకు ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఇస్తాము. లైఫ్ టైం ఉచిత క్రెడిట్ కార్డు మీకోసం. అంటూ మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా ?  ఐతే జాగ్రత్త తొందర పడి ఆ క్రెడిట్ కార్డ్ ల వలలో పడకండి. 

మీ సంపాదన , మీ ఖర్చులు మిగిలేది పొదుపు. అప్పుడే జీవితం ఆనందం గా ఆహ్లాదం గా ఉంటుంది. సంపాదన ఖర్చులు అప్పులు ఉంటే ఆ జీవితం నిరాశగా , నిస్పృహ తో ఉంటుంది. 

ఈ క్రెడిట్ కార్డ్ లు మిమ్మల్ని ఇలానే అప్పుల ఊబి లోకి లాగుతాయి. మీకు అవసరం లేక పోయినా మీ చేత ఖర్చు పెట్టిస్తాయి. 
మీ సంపాదన కన్నా మీరు ఎక్కువ ఖర్చు పెట్టేలా చేస్తాయి. అందుకే ఈ క్రెడిట్ కార్డు లతో చాలా జాగ్రత్త గా ఉండాలి. 
మీకు అవసరం లేకపోయినా మీ క్రెడిట్ లిమిట్స్ లక్షల్లో మీకు అందుబాటు లో ఉంచుతాయి క్రెడిట్ కార్డ్ కంపెనీ లు. 
ఆ తరువాత ఆఫర్స్ లతో వల వేస్తాయి. ఆ వలలో మీరు చిక్కుకుని మైమరిచి ఖర్చు పెట్టారో ఇక అంతే సంగతులు. 
ఆ తరువాత ఆ అప్పులు తీర్చలేక వడ్డీ లకు వడ్డీ లు చెల్లిస్తూ అప్పుల ఊబి లో కూరుకు పోవడం కాయం. 

పూర్తి బిల్లు చెల్లించక పోతే వడ్డీ లు ఎక్కువ చెల్లించాలి ఇది అంతా మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు. క్రెడిట్ కార్డ్ ల పై వడ్డీ రేట్లు చాలా ఎక్కువ గా ఉంటాయి. సుమారు 35% నుండి 45% వరకు వసూలు చేస్తాయి క్రెడిట్ కార్డ్ కంపెనీ లు. 

మీరు క్రెడిట్ కార్డ్ పై ఖర్చు పెట్టే మొత్తానికి 45 రోజుల వరకు ఎటువంటి చార్జీలు వసూలు చేయవు. మీరు బిల్లులు సకాలం లో చెల్లిస్తే అంతా సవ్యం గానే ఉంటుంది. మీరు బిల్లు మొత్తం చెల్లించక పోయినా, ఆలస్యం గా చెల్లించిన మీకు చార్జీలు, వడ్డీల మోత ప్రారంభం అవుతుంది. వడ్డీలు వాటికి చక్ర వడ్డీలు. 
బిల్లు చెల్లించని సమయం లో మీరు వాడే మొత్తానికి 45 రోజుల గడువు కూడా ఉండదు. కార్డు పై ఖర్చు పెట్టిన ప్రతీ పైసా కు వడ్డీ చెల్లించాలి. 

క్రెడిట్ కార్డ్ లు పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టు లెక్క. ఏమాత్రం అజాగ్రత్త గా ఉన్న ఏ క్షణం ఐనా కాటు వేయవచ్చు. తస్మాత్ జాగ్రత్త.  

ఇక క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చాక మీరు మినిమం బిల్ చెల్లిస్తే చాలు అని కూడా చెప్తారు. మనం పూర్తి బిల్ చెల్లించకుండా మినిమం బిల్ ను (అంటే మొత్తం బిల్లు లో 10% ఉంటుంది) చెల్లిస్తూ ఉంటే మనకి వడ్డీ లతో బాదుతూ ఉంటారు. 

ఖర్చు పెట్టిన మొత్తాన్ని సరళం గా సమాన వాయిదాలలో చెల్లించ మని ఆఫర్స్ కూడా ఇస్తారు. ఇక దానికి వడ్డీ లు, వాయిదా పద్ధతి లో కి చేసినందుకు చార్జీలు. మొత్తం తడిసి మోపెడు అవుతుంది. 
మన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. అందులో క్రెడిట్ కార్డు తో. 

మిమ్మల్ని అప్పులోముంచడానికి  రివార్డ్ పాయింట్స్ తో వలలు వేస్తూనే ఉంటారు. ఏమాత్రం ఆశ పడినా ఇక అంతే సంగతులు. రివార్డ్ పాయింట్స్ ని రీడీమ్ చేసుకోవాలన్న కూడా చార్జీలు. 
ఇవి ఏవీ కూడా మనకి క్రెడిట్ కార్డ్స్ జారీ చేసేటప్పుడు చెప్పరు. మన అనుభవం మీద తెలుసు కోవాలి అని అనుకుంటారు ఏమో !  మన చేత అన్ని నిబంధనలు అంగీక రిస్తున్నామని సంతకం మాత్రం చేయించుకుంటారు. 

ఒక్కసారి బిల్ కట్టక పోతే తెలుస్తుంది క్రెడిట్ కార్డ్ లు ఎంత ప్రమాద కరమో. మీకు వచ్చే ఫోన్ కాల్స్, మీ మీద బిల్ కట్టమని చేసే వత్తిడి ఎలా ఉంటుందో అనుభవమ్ తోనే తెలుస్తుంది.  

మరి క్రెడిట్ కార్డ్ లతో లాభాలు లేవా అంటే ఉన్నాయి. వాటి గురించి మరో వ్యాసం లో తెలుసుకుందాం. 

క్రెడిట్ కార్డ్ లపై మీ అభిప్రాయాలు ను కామెంట్ రూపం లో తెలియచేయండి. 

- భద్రిరాజు తటవర్తి 

Post a Comment

Previous Post Next Post