మన దేవాలయాలు ఒక అద్భుతం. మన దేశం లో ఎన్నో చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నిర్మాణ రహస్యాలు, కొన్ని అంతుచిక్కని రహస్యాలు , మరికొన్ని అద్భుతమైన వాస్తు కళ తో మనల్ని మంత్ర ముగ్ధులు ను చేస్తూ ఉన్నాయి. అటువంటి ఆలయాల గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. రాబోయే తరాలకు ఈ అద్భుతమైన వారసత్వ సంపదను కానుకగా ఇవ్వాలి.
పరిశోధనలకు అందని రహస్యం - జ్వాలాముఖి ఆలయం
జ్వాలముఖి ఆలయం. అంతు చిక్కని రహస్యానికి ఒక చిరునామా. భారత దేశం లోని అతి పురాతన ఆలయం జ్వాలముఖి ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని జ్వాలముఖి ప్రాంతం లో ఉంది. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి గా ప్రసిద్ది చెందింది. మన పురాణాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది.
![]() |
Jwalamukhi temple |
ఈఅలయం లో ఇతర దేవాలయాల మాదిరిగా విగ్రహం ఉండదు. మండుతున్న మంట ( జ్వాల) ఈ ఆలయం లో మనం చూడవచ్చు. నిరంతరం రాళ్ళ మధ్యనుండి వస్తున్న ఒక నీలి రంగులోని జ్వాల ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఈ ఆలయం లోని వివిధ ప్రదేశాలలో ఈ మంటను మనం గమనించవచ్చు.
![]() |
అక్బర్ చక్రవర్తి చేయించిన ఛత్రం |
కాంగ్రా ను పరిపాలించే రాజు భూమిచంద్ కటొచ్ దుర్గాదేవి భక్తుడు. ఈయనకు ఒకరోజు అమ్మవారు కలలో కనపడి ఈ ప్రదేశం లో తాను ఉన్నాను అని చెప్పింది. తరువాత ఆయన ఆ ప్రదేశం గురించి , తనకు వచ్చిన కల గురించి తన గ్రామం లోని ప్రజలకు చెప్పి ఆ ప్రదేశాన్ని వెతకమని ఆదేశించాడు. ప్రజలు ఈ ప్రదేశం కనుగొన్నారు. తరువాత ఈ ప్రాతం లో ఒక ఆలయాన్ని నిర్మించాడు. అని చారిత్రక కథనం.
ఈ ఆలయం లో నిరంతరం మండుతున్న జ్వాల గురించి అనేక శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. కానీ ఈ నిరంతర సహజ జ్వాలల వెనుక కారణాన్ని ఎవరూ కనుగొనలేక పోయారు. శాస్త్రవేత్తలు ఈ జ్వాలముఖి ఆలయం క్రింద ఒక నిద్రాణమై ఉన్న అగ్ని పర్వతం ఉంది అని , ఆ అగ్ని పర్వతం నుండి వెలుబడే వాయువులు జ్వాల రూపం లో వస్తున్నాయి అని ఈ జ్వాలనే హిందువులు దేవత గా ఆరాధిస్తారని పేర్కొన్నారు. 70 వదశకం లో సహజ వాయువు యొక్క ఉనికిని కనుగొనడానికి ప్రభుత్వము ఒక ప్రయత్నాలు చేసింది. ఒక విదేశీ సంస్థను జ్వాలముఖి ప్రాతం లోని సహజ వాయు నిక్షేపాలు కనుగొనడానికి నియమించింది. వారు కొన్నేళ్ల పాటు సహజ వాయు నిక్షేపాలు కోసం ప్రయత్నాలు , పరిశోధనలు చేసి ఇక్కడ అటువంటి సహజవాయువులు ఏమీ లేవని వెనుతిరిగారు.
చారిత్రక కథనం ప్రకారం మొఘల్ చక్రవర్తి అక్బర్ ఒకసారి ఈ జ్వాలా ముఖి దేవి మంటలను ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. ఈ మంటలను ఒక ఈ ఇనుప రేకు తో కప్పి ఆ ప్రాతం లో నీటిని వదిలిపెట్టాడు. ఐనప్పటికీ ఆ మంటలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఇక ఆ తర్వాత తన ప్రయత్నాలు విరమించుకున్న అక్బర్ ఈ ప్రాతం లో ఒక బంగారు గొడుగును జ్వాలా దేవి కి చేయించాడు. ఈ ప్రాంతం గొప్పతన్నాని తెలుసుకున్న ఔరంగజేబు కూడా ఢిల్లీ నుండి వచ్చి జ్వాలముఖి దేవి దర్శనం చేసుకున్నాడు.
ఈ ఆలయం లో నిరంతరం వెలుగుతున్న జ్వాలల వెనుక ఒక అంతుచిక్కని రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు విఫమయ్యారు.
పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు మనవురాలు, శివుడి భార్య పార్వతి కి సంభందించిన నాలుక ఈ ప్రాతం లో పడిపోయింది. అది ఇప్పుడు జ్వాల రూపం లో మండుతూ ఉంది.
పురాణాల ప్రకారం, తన తండ్రి శివుడిని అవమానించడంతో పార్వతి తనను తాను కాల్చుకుంది. తన భార్యను కోల్పోయిన కోపంతో, కోపంతో ఉన్న శివుడు తన భుజాలపై పార్వతి యొక్క కాలిపోయిన శరీరంతో తాండవ నృత్యం చేశాడు. ఈ నృత్యంలో, పార్వతి శరీరం విడిపోయింది . ముక్కలు భూమిపై వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఆ ముక్కలు పడిన వివిధ ప్రదేశాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి.
ఈ ఆలయం లో జ్వాలముఖి దేవి నిరంతరం మండుతున్న జ్వాలగా మనకు దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆలయం గుడిగోపురం , అందమైన వెండి పలకల తలుపులతో తీర్చిదిద్దబడింది.
ఈ ఆలయం ధర్మశాల సిమ్లా రహదారిలో జావళ ముఖి రైల్వే స్టేషన్ రోడ్ నుండి 20 కిలోమీటర్లు దూరం లో ఉంది. ప్రతీ సవంత్సరం లక్షలాది యాత్రికులు ఈ ఆలయానికి వచ్చి జ్వాలముఖి దేవి ని దర్శించుకుంటారు. జ్వాలముఖి దేవి ఆలయం అధికారిక వెబ్సైట్ ..https://jawalajitemple.com/how-to-reach/ ను మరిన్ని వివరాల కొరకు దర్శించవచ్చు.
అందమైన హిమాలయాల దిగువున ఉన్న ఈ ఆలయం సైన్స్ కు అందని రహస్యం తో ఎంతో మంది భక్తులను ఆకట్టుకుంటూనే ఉంది.
- భద్రిరాజు తటవర్తి
Post a Comment