ఈ ఫోటో చూస్తే... పిజ్జా తింటారా?

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో కన్నా బయట తినడాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ఆకలి వేస్తె swiggy, జమోటో వంటి అప్లికేషన్ లలో ఆర్డర్ పెట్టుకుని కొన్ని నిముషాలలో లోనే నచ్చిన రెస్టారెంట్ నుండి ఫుడ్ ని తెప్పించుకుంటున్నారు. కానీ ఆ ఆహార పదార్ధాలు ఎటువంటి వాతావరణం లో తయారు చేస్తున్నారు అనేది ఎవరూ కొంచం కూడా ఆలోచించరు. బెంగళూరు లో జరిగిన వెలుగులోకి వచ్చిన ఓ ఫోటో బయట తినే ఆహారాన్ని గురించి మరో సారి ఆలోచించేలా చేస్తుంది. డో్మినోస్ పిజ్జా కు ఎంత డిమాండ్ ఉందొ అందరికీ తెలిసిందే. ఈ ఇటలీయన్ పిజ్జాలకు పిదా కానీ వారు ఎవరూ ఉండరు అనడం లో అతిశయోక్తి లేదు. ఐతే ఇటీవల డో్మినోస్ పిజ్జా తయారు చేసే కిచెన్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. బహుశా మీరు ఆ ఫోటో చూస్తే ఇక ఎప్పుడూ పిజ్జా తినక పోవచ్చు ఏమో!!

డో్మినోస్ ఇండియా  బెంగళూరు లోని ఒక అవుట్ లెట్ లో పిజ్జాలు తయారు చేసే కిచెన్ లో ఉన్న పరిశుభ్రత..చూస్తే మీరు ఇక జీవితం లో పిజ్జా తినరేమో! 

 బెంగళూరు(Bengaluru)లోని డొమినోస్ (Domino’s India) ఔట్ లెట్లలో ఒకదాంట్లో పిజ్జా ట్రేలపైన టాయిలెట్ బ్రష్, మాప్స్, వస్త్రాలు వేలాడదీశారు.
 ఇందుకు సంబంధించిన ఫోటోను తుషార్ అనే వ్యక్తి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

తుషార్ ఫోటోను షేర్ చేస్తూ  ఇలా ట్వీట్ చేశారు.. ప్రతి ఒక్కరూ దుకాణంలో కొనుగోలు చేసిన ఫుడ్ కంటే ఇంట్లో తయారుచేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బెంగళూరులోని డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా ట్రేల పైన క్లీనింగ్ మాప్స్, టాయిలెట్ బ్రష్, బట్టలు వేలాడదీయడం చూడవచ్చు. దయచేసి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇష్టపడండి అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్ పై నెటజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డొమినోస్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇంతలో మరో ట్విట్టర్ యూజర్ ఆహారాన్ని భయకరమైన పరిస్థితుల మధ్య ఎలా తయారు చేస్తున్నారో చూపించే వీడియో ఒకటి షేర్ చేశారు.

ఈ పోస్ట్ బయట ఆహారాన్ని తినే వారిని ఆలోచనలో పాడేసింది అనడం లో అతిశయోక్తి లేదు. 


Post a Comment

Previous Post Next Post