Kanipakam Ganapathi : రోజు రోజు పెరుగుతున్న కాణిపాకం వరసిద్ధి గణపతి

రోజు రోజు కు పెరుగుతున్న వరసిద్ధి గణపతి ని  కోరిన కోరికలు తీర్చే భగవంతుడు గా నమ్ముతారు. ఈ గణపతి పై ప్రమాణం చేసి అబద్దం చెప్పడానికి భయపడతారు.  1000 సవంత్సరాలు పైగా ఉన్న అతి పురాతన గణపతి ఆలయం గా ప్రసిద్ధి గాంచిన కాణిపాకం ఆలయం (KANIPAKAM TEMPLE ) గురించి ఎన్నో విశేషాలు ఈ వ్యాసం లో తీసుకోండి.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం చిత్తూరు జిల్లా లో ఉంది. చిత్తూరు నగరానికి కేవలం పది కిలోమీటర్లు దూరంలో  కాణిపాకం  (KANIPAKAM) గ్రామంలో ఉంది . కాణిపాకం గ్రామం లో ఈ పురాతన గణేశ దేవాలయాన్ని కాణిపాకం వినాయక దేవాలయం (KANIPAKAM VINAYAKA TEMPLE) అని కూడా అంటారు.
 ఈ ఆలయ ప్రధాన దైవం స్వయంబు   శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. కోరిన కోరికలు తీర్చే స్వయంబు ఆలయం గా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం లో ఉన్న స్వామి వారి విగ్రహం ప్రతీరోజు కొంత ఎత్తు పెరుగుతుంది అని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు.

కలియుగం ముగిసే వరకు ఈ గణపతి విగ్రహం పరిమాణం పెరుగుతుందని , ఆపై స్వామి వారు  ప్రత్యక్షమవుతారు అని భక్తులు నమ్ముతారు.


శ్రీ వరసిద్ధి వినాయకుడు వెలిసిన బావి ఇప్పటికీ ఆలయంలో ఉంది . ఈ ఆలయంలో బావిలోని పవిత్ర జలాన్ని పవిత్ర జలం గా భక్తులు భావిస్తారు. భక్తులకు ప్రసాదంగా ఈ జలాన్ని పంపిణీ చేస్తారు . 11 వ శతాబ్దం CE ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు -1 చేత  ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా నమ్ముతారు .

 " కాని " అంటే ఒక వంతు భూమి మరియు " పాకం " అంటే భూమిలోకి నీరు అంటే దీని యొక్క సూచన కాణి పాకం గా గుర్తించబడింది. ఈ విధం గా ఈ గ్రామానికి కాణిపాకం అని పేరు స్థిరపడింది. 

పురాతన ఆలయ పురాణాల ప్రకారం ముగ్గురు సోదరులు ఉండేవారు. ఆ సోదరులు ముగ్గురికి   ఒక వైకల్యం ఉండేది . ఒకరోజు వారు నీటి కోసం బావిని త్రవ్వడం ప్రారంభించారు.  అలా భావి తవ్వుతుండగా గునపం ఒక రాయికి తగిలింది.  ఆ తర్వాత ఆ రాయి నుండి రక్తం వచ్చి ఆ బావి లోని నీటిలో కలిసింది. ఆ బావి లోని నీరు అంతా    ఎర్రగా మారిపోయింది . ఇది అంతా చూసిన ఆ అన్న తమ్ములు వైకల్యం పోయింది. వారు పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. 

 ఈ అద్భుతం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే బావిని మరింత లోతుగా చేశారు. వారికి అక్కడ శ్రీ వరసిద్ది వినాయకుని " స్వయంభూ " విగ్రహం కనబడింది. ఆ విధం గా స్వామి వారు విగ్రహం ఇక్కడ బావిలో నుండి ఉద్భవించింది .

తరువాత  ప్రజలు బావి చుట్టూ ఆలయాన్ని నిర్మించారు . నేటికీ  విగ్రహం మూలపు బావిలో ఉంది.  బావి లో నీటి ఊటలు ఎల్లప్పుడు ఉంటాయి .

వర్షాకాలంలోఈ బావి నీటి తో నిండి పోయి,పవిత్ర జలం బయటకు పొంగి ప్రవహిస్తుంది . విగ్రహం యొక్క మరొక విచిత్రం ఏమిటంటే ఇది ఇప్పటికీ పరిమాణంలో పెరుగుతోంది .

శ్రీ వరసిద్ది వినాయకుని స్వయంభూ విగ్రహం సత్యాన్ని నిలబెడుతుందని భక్తులు నమ్ముతారు . వివాదాలు ఉన్న వారు ఇక్కడ ప్రమాణం చేయడం ద్వారా పరిష్కరించుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆలయ ప్రాంగణం లో పవిత్ర స్నానం చేసి స్వామివారి ముందు ప్రమాణం చేయడం నిత్యం ఆచారం .


కాణిపాకం ఆలయం లో వేడుకలు 

వినాయక చతుర్థి మరియు ఆంగ్ల నూతన సంవత్సరం రోజున పండుగలు మరియు వేడుకలు ఆలయంలో జరుపుకునే పండుగలు . వార్షిక బ్రహ్మోత్సవం గణేష్ చతుర్థి నుండి 21 రోజుల పాటు అన్ని సాంప్రదాయ ఆచారాలు  వైభవంగా ఇక్కడ జరుగుతాయి. 

రంగులతో అలంకరించబడిన ఉత్సవ విగ్రహాన్ని అన్ని రోజులలో వివిధ బండ్లపై ఊరేగింపుగా తీసుకువెళతారు. ప్రతీ ఏడు 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ఆలయం లో ప్రధాన వార్షిక పండుగ. 

బ్రహ్మోత్సవాలు భాద్రపద శుద్ధ చవితి నుండి ప్రారంభమవుతాయి మరియు 21 రోజుల పాటు కొనసాగుతాయి . బ్రహ్మోత్సవం సమయంలో ఆలయ ఆచారాలు మినహా ఉభయదార అభిషేకం , పాలాభిషేకం , కల్యాణం , ఊంజల్ సేవ , ఏకథాసేవ వంటి ఇతర సేవలు నిర్వహించబడవు .

ఈ ఆలయానికి ప్రతీ రోజు దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు.
కాణిపాకం గ్రామం లో భక్తులు బస కు అవసరమైన హోటల్స్ అందుబాటు ధరలలో ఉన్నాయి. అలాగే దగ్గరలోని చిత్తూరు లో కూడా మంచి సౌకర్యాలతో కూడిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కాణిపాకం నుండి ప్రతీ రోజు తిరుపతి కి బస్సులు ను ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనం కూడా చేసుకుని వెళుతూ ఉంటారు. తిరుపతి కి సుమారు 75 కిలోమీటర్లు దూరం లో కాణిపాకం ఆలయం ఉన్నది.


బ్రహ్మోత్సవాల సందర్భంగా సిద్ది బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కాణిపాకం గ్రామంలోని 4 మాడ వీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. 

బ్రహ్మోత్సవాల కు వచ్చే భక్తులకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. 

కాణిపాకం ఎలా చేరుకోవాలి ?

రవాణా చిత్తూరు, తిరుపతి నుండి నిత్యం APSRTC బస్సులు అందుబాటులో ఉన్నాయి . కాణిపాకం చిత్తూరు నుండి 11 కి.మీ దూరం లో మరియు తిరుపతి నుండి 75 కి.మీ. దూరం లో ఉంది. 

సమీప రైల్వే స్టేషన్ చిత్తూరు . ఇది రైలు ద్వారా బెంగళూరు , చెన్నై మరియు తిరుపతికి బాగా అనుసంధానించబడి ఉంది . కాట్పాడి లేదా తిరుపతి మీదుగా ప్రయాణించే రైళ్లు ఉన్నాయి.  కానీ ఇవి చిత్తూరును తాకవు . అటువంటి సందర్భాలలో , కాట్పాడి ( చిత్తూరు నుండి కేవలం 35 కి.మీ ) లేదా తిరుపతి ( చిత్తూరు నుండి 70 కి.మీ ) దిగడానికి అనుకూలమైన పాయింట్లు . కాట్పాడి / తిరుపతి నుండి రైలు లేదా బస్సులో చిత్తూరు చేరుకోవచ్చు .  తిరుపతి ( రేణిగుంట ) సమీప విమానాశ్రయం . బెంగళూరు , హైదరాబాద్ మరియు చెన్నై నుండి తిరుపతికి డైరెక్ట్ విమానాలు అందుబాటులో ఉన్నాయి . రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతికి  మరియు తిరుపతి నుండి కాణిపాకం బస్సు లేదా వాహనంలో 75 కి.మీ. దూరం మాత్రమే.
Post a Comment

Previous Post Next Post