డెలివరీ బాయ్ పై కోపం.. కానీ అతనిని చూసి

ఒక్కోసారి మనం అనుకున్నది అనుకున్నట్టు గానే జరుగుతుంది. కానీ ఒక్కోసారి మనం అనుకున్నది పూర్తి వ్యతిరేకం గా జరుగుతుంది. రోహిత్ కుమార్ అనే బెంగుళూరు వాసి కి ఇలానే జరిగింది.

 తాను ఒకటి అనుకుని ఫుడ్ డెలివరీ బాయ్ పై కోపం తెచ్చుకున్నాడు. కానీ తరువాత  వాస్తవం తెలుసుకుని కూల్ అయ్యాడు. అదేంటో మనము తెలుసుకుందాం!
బెంగళూరు లో రోహిత్ కుమార్ అనే వ్యక్తి అప్పుడప్పుడు స్విగ్గి నుండి ఫుడ్ తెప్పించుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ చాలా తొందరగావచ్చే పార్సెల్ ఇప్పుడు మాత్రం చాలా లేట్ అయ్యింది. అరగంట దాటి, గంట అయ్యిన కూడా పార్సెల్ రాలేదు. ఆకలి తో ఉన్న రోహిత్ కుమార్ ఆ ఫుడ్ పార్సెల్ కోసం ఎదురు చూస్తూ ఆకలితో పాటు కోపం కూడా వచ్చింది.
ఫుడ్ డెలివరీ బాయ్ పైన చాలా కోపం  వచ్చింది. డెలివరీ బాయ్ రాగానే చాలా తిట్టాలి అనుకున్నాడు. ఇంతలోనే వచ్చిన డెలివరీ బాయ్ దగ్గర పార్సెల్ తీసుకుందామని డోర్ తీసి చుస్తే రోహిత్ కుమార్ కి నోటి వెంట మాట రాలేదు. డెలివరీ బాయ్ చిరునవ్వులు చిందిస్తూ పార్సెల్ అందిస్తున్నాడు. కానీ అతని రెండు చేతులలో ఊత కర్రలు ఉన్నాయి. అతనికి కాళ్ళు లేవు. 40ఏళ్ల వయసు ఉన్న ఆ డెలివరీ బాయ్ ని చూసి సిగ్గుతో తల దించుకున్నాడు. తరువాత ఆయనకి క్షమాపణ చెప్పి ఆ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
‘నా ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసిన ఆయన పేరు కృష్ణప్ప రాథోడ్. కేఫ్‌లో పని చేస్తుండేవారు. అయితే కరోనా కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆర్ధిక స్తోమతి అంతంతమాత్రంగా ఉండటంతో.. తన కుటుంబాన్ని పోషించేందుకు ఇలా డెలివరీ బాయ్‌గా మారారు. తెల్లారగానే తన ఉద్యోగాన్ని మొదలు పెడతారు.. రాత్రి పొద్దుపోయేదాకా డెలివరీలు అందజేసి ఇంటికి చేరుకుంటారు. ఈయనకు ఎవరైనా సరే.. తమకు తోచిన సాయం చేయాలంటూ’ రోహిత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, రోహిత్ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది కృష్ణప్ప రాథోడ్‌కు డబ్బులు డొనేట్ చేయగా.. మరికొందరు ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రశంసలు కురిపించారు. ఇప్పడు ఈ పోస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతూ ఉంది.

అన్ని అవయువాలు ఉన్నా ఏ పని చేయకుండా కాలం గడిపేసే సోమరులు ఉన్న నేటి రోజుల్లో, కాళ్ళు లేకపోయినా ఆత్మ విశ్వాసం తో తన కుటుంబం కోసం కష్ట పడుతున్న కృష్ణప్ప రాదోడ్ అందరికీ ఆదర్శం. 

Post a Comment

Previous Post Next Post