Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు.
ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.
తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.
అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.
సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది.
ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.
ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల, హిందూ అలంకరణను సూచించే నగలు ధరించిన ఈమె ఐక్య రాజ్య సమితి కి చెందిన సీఈఎస్ఆర్ (Committee on Economic, Social and Cultural Rights) 19వ సమావేశానికి హాజరైయింది.
ఈమె స్వామి నిత్యానంద మనదేశం నుండి పారిపోయి అక్రమ సొమ్ము తో కొనుకున్న కైలాస దేశానికి అంబాసిడర్… ఈ ఐక్యరాజ్య సమితి పెట్టిన మీటింగు లో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడుతూ హిందుత్వానికీ ఈ సుస్థిరాభివృద్ధికీ లంకె ఉన్నట్టు విజయప్రియ నిత్యానంద చెప్పింది.
మా స్వామి నిత్యానందను ఆయన పుట్టిన మాతృ దేశం వేధిస్తోందనీ, శిక్షించాలనీ భావిస్తోందనీ భారత్ పై ఆరోపణలు చేసింది. … ప్రపంచ సమాజం జోక్యం చేసుకోవాలని కూడా డిమాండ్ చేసింది.
అక్రమ మార్గాలులో డబ్బులు సంపాదించో, తప్పుడు పనులు చేసి దేశం దాటిపోయిన బాసులు మీరు ఓ దేశం కోనేయండి మరి.
Comments
Post a Comment