తమిళనాడు లోని డి ఎమ్ కే పార్టీ కార్యకర్తలు అనందం లో తేలుతున్నారట! దీనికి కారణం జమ్మూ కాశ్మి్ర్ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.
తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాల ప్రధాని అభ్యర్ధి కాబోతున్నారు కాంగ్రెస్‌తో సహా మిత్రపక్షాలు ఈవిషయంపై క్లారిటీకి వచ్చాయాని గుసగుసలు వినపడుతున్నాయి.
![]() |
M. K. STALIN |
చెన్నైలో జరిగిన స్టాలిన్ జన్మదిన వేడుకల్లో ఈ మ్యాటర్ హాట్‌టాపిక్‌గా మారింది.
డీఎంకే అధినేత , తమిళనాడు సీఎం స్టాలిన్ 70వ ఏటా అడుగుపెట్టారు. చెన్నైలో ఘనంగా స్టాలిన్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్టాలిన్ ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతారు అనే అంశం ఇప్పుదు చర్చనీ య అంశం గా మారింది.
స్టాలిన్ జన్మదిన వేడుకలకు జాతీయస్థాయి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భం గా జమ్మూ కాశ్మిర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ ప్రజల సంక్షేమం కోసం డీఎంకే కృషి చేస్తోందని , స్టాలిన్ దేశ ప్రధాని అయితే బావుంటుంది అని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే , సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ , బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ హాజరయ్యారు. బీజేపీని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విపక్షాలు ఏకం కావాలని ఈ సమావేశానికి హాజరైన విపక్షనేతలు పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యతను కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.
జాతీయ రాజకీయాల లోకి అడుగు పెట్టాలని స్థాలిన్ యోచిస్తున్నారు. అందుకోసం జాగ్రత్తగా రాజకీయ పావులు కదుపుతున్నారు స్టాలిన్ .
తమిళనాడు, పాండిచ్చేరిలో డీఎంకేను తిరుగులేని శక్తిగా నిలపాలని కలలు కంటున్నారు స్థాలిన్. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడ్డ శూన్యతను ఎలాగైనా తాను భర్తీ చేయాలని స్టాలిన్ అనుకుంటున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి తమిళనాడు, పాండిచ్చేరిలో పూర్తి స్థాయి ఆధిక్యం లోకి రావాలని అనుకుంటున్నారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ తో పొత్తు తో పాటు, ప్రాంతీయ తమిళ పార్టీలతో కూడా పొత్తుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
స్థాలిన్ కు డీఎంకే కార్యకర్త ఒంటె పిల్ల బహుమతి
స్టాలిన్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు , డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు.
పలువురు నేతలు స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని డీఎంకే నేతలు ఆకాక్షించారు. ఓ అభిమాని స్టాలిన్‌కు ఒంటెపిల్లను బహుమతి ఇచ్చారు.
Comments
Post a Comment