మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.
మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ 60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు.
చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రామోజీ గ్రూప్ లో ఒకటిగా నిర్వహింపబడుతూ ఉంది. రామోజీ రావు ప్రారంభించిన ఏ సంస్థ అయినా ఒక చక్కని ప్రణాళిక తో ముందుకు వెళ్తూ ఉంటాయి. దానికి ఉదాహరణ ఈనాడు దినపత్రిక, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు ఇతర వ్యాపారాలు.
చిట్ ఫండ్ వ్యవస్థను ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో చిట్ ఫండ్ వ్యాపారానికి మార్గదర్శకత్వం వహించిన ఘనత మార్గదర్శి సంస్థకు దక్కుతుంది.మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రామోజీరావు, శైలజాకిరణ్ చెరుకూరి.
ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. కానీ అంచెలు అంచెలు గా ఎదుగుతూ పక్క రాష్ట్రాలు అయిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా విజయవంతం గా నడపబడుతూ ఉంది.
ఒక్కో సంవత్సరం ఖాతా దారులను పెంచుకుంటూ ఒక ప్రసిద్ధ చిట్ ఫండ్ సంస్థ గా మార్గదర్శి చిట్ ఫండ్ జనాదరణ పొందింది.
ప్రజలు ఆదా చేయడానికి లాభదాయకంగా, సులభం గా ఆకస్మిక పరిస్థితులను తీర్చడానికి అనువైన మార్గంగా ఉండడమే కాకుండా ప్రజల సొమ్ముకు కాపలాదారుగా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వలన ప్రజలకు చాలా తక్కువ సమయంలో దగ్గరైంది.
మార్గదర్సి విలువలు, పనితీరు, నిజాయితీ, వృత్తిపరమైన సమగ్రత, అధిక నాణ్యత గల సేవలు, సంపూర్ణ ఆర్థిక క్రమశిక్షణ దాని నాయకత్వ స్థానాన్ని నిలుపుకోవడంలో అడుగుడుగునా సహాయపడ్డాయి.
మార్గదర్శి సంవత్సరాలుగా ఊహించని రీతిలో వృద్ధిని సాధిస్తూ ఉంది. 4,300 మంది ఉద్యోగులు, 16015 మంది ఏజెంట్లు తో 108 బ్రాంచీలు గా విస్తరించి సేవలు అందిస్తూ ఉంది.
పేద , మధ్యతరగతి, చిన్న పరిశ్రమల వారికి ఎంతో ప్రయోజనకరంగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో విజయవంతం గా నడుస్తున్న సంస్థ మార్గదర్శి.
సంస్థ ఎదుగుదలలో ఎన్నో రాజకీయ ఒత్తిడి లు ఎదురుకున్నా ఖాతాదారుల శ్రేయస్సు నే లక్ష్యం గా పెట్టుకుని ముందుకు వెళ్తున్న సంస్థ మార్గదర్శి మాత్రమే. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏరోజు ఒక్క ఖాతా దారుడు నుండి సేవా లోపం ఉంది అని ఒక్క పిర్యాదు రాకపోవడం దీనికి నిదర్శనం.
Comments
Post a Comment