Naveen murder : హైదరాబాద్ శివారులోని అబ్దులాపూర్ మెట్ లో నవీన్ అనే యువకుడి హత్య రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం రేపింది.
హరి హరే కృష్ణ, తన ప్రియురాలికి నవీన్ దగ్గరవుతున్నాడని పార్టీ పేరుతో పిలిచి కిరాతకంగా హత్య చేశాడు.
నవీన్ ను హత్య చేసిన తర్వాత శరీర భాగాలను కోసి వాటిని ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు.
హరిహర ఎక్కువగా క్రైమ్ సిరీస్ లు చూసి పక్కా పథకంతోనే నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.
పక్కా పధకం ప్రకారం జరిగిన ఈ హత్య తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ హత్యలో హరిహర ప్రేయసి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నవీన్ హత్య (naveen murder)
కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనం లో తెలుసుకోండి.
Naveen Murder Case :
నవీన్, హరిహర కృష్ణ స్నేహాతులు. ఒకే కళాశాల లో చదువుతున్నారు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈ ఇష్టమే ఇప్పుడు నవీన్ ప్రాణాలను బలిగొంది.
హరిహర కృష్ణ తాను ప్రేమించిన యువతి కి నవీన్ కూడా దగ్గరగా ఉండడం సహించ లేకపోయాడు.
రోజు కలిసి తిరిగినా మనసులో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్ ను అంతం చేయాలని ప్రణాళికసిద్ధం చేసుకున్నాడు. స్నేహితుడే ప్రాణం తీస్తాడని నవీన్ కలలో కూడా ఊహించలేదు.
దారుణంగా హత్య
నవీన్ హత్య (Naveen murder) రిమాండ్ రిపోర్టర్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హరిహర కృష్ణ తన ప్రేమకి అడ్డు వస్తున్నాడనే నవీన్ ను హత్య చేసినట్లు తెలుస్తూ ఉంది.
హరి హర కృష్ణ ఈ హత్య తానే చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మూడునెలల ముందే హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు .
మలక్ పేట్ లో కత్తి కొని....
రెండునెలల క్రితం మే నవీన్ హత్య కు పధకం వేసిన హరి హర కృష్ణ హైదరాబాద్ మలక్ పేట్ సూపర్ మార్కెట్ లో కత్తి కొనుగోలు చేశాడు.
2023 ఫిబ్రవరి 17 న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను హత్య చేశాడు. హత్యకు ముందు నవీన్ ను పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో హరిహర కృష్ణ మద్యం తాగేలా చేసాడు. తరువాత తన బండి పై ఓఆర్ఆర్ సమీపం లో ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు.
అక్కడ మద్యం మత్తులో వచ్చిన మాటలు లో యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.
అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆ నిర్మాణుష్య ప్రాంతంలో నవీన్ గొంతునులిమి హత్య చేశాడు హరిహర కృష్ణ.
ఆ తర్వాత కత్తితో నవీన్ శరీరాన్ని విడిభాగాలుగా చేశాడు. నవీన్ తల, వేళ్లు, ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
బ్రాహ్మణ పల్లి నిర్మాణుష్య ప్రదేశంలో అవయువాలు ఉన్న ఆ బ్యాగును పడేసిన నిందితుడు హరిహర కృష్ణ
అనంతరం పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లాడు.
హాసన్ ఇంటిలో స్నానం చేసి డ్రస్ మార్చుకుని హత్య విషయాన్ని హసన్ కు చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి సైతం హత్య విషయం చెప్పాడు నిందితుడు.
అక్కడి నుంచి బయల్దేరి వరంగల్‌లోని తండ్రి ప్రభాకర్ వద్దకు వెళ్లాడు. అప్పటికే నవీన్ కనిపించడం లేదని స్నేహితుల నుంచి హరిహరకృష్ణకు ఫోన్లు రావడంతో ఏం జరిగిందని హరిహరకృష్ణను తండ్రి ప్రశ్నించాడు.
అక్కడే ఉంటే తండ్రికి అనుమానం వస్తుందని భావించి 19వ తేదీన పని ఉందంటూ హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నానికి పరారయ్యాడు.
ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు హరిహర కృష్ణ. హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ శరీర విడి భాగాలు సేకరించి వాటిని దహనం చేశాడు. ఫిబ్రవరి 24 సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు.
క్రైం వీడియో లు చూసి....
క్రైం వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ చూసి నవీన్ హత్యకు కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు . ఈ హత్య కేసులో అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ తెలిపారు.
అయితే నవీన్ హత్య అనంతరం, నవీన్ ఆచూకీ తెలుసుకోడానికి ఒక స్నేహితుడు ఆమెకు కాల్ చేయగా తనకేం తెలియదని ఆమె మాట్లాడిన తీరు పలు అనుమానాలకు తావిస్తుంది.
ఇక ఈ హత్య విషయం హరిహర కృష్ణ (Hari hara krishna) తన తండ్రికి, గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితునికి చెప్పాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
ఇక ఈ కేసులో కీలకంగా భావించిన హరిహర గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు సహకరించడం లేదని సమాచారం. . ఆమె నుండి సమాచారం రాబట్టడం పోలీసులకు కష్టతరం గా మారింది.
ఇప్పటికే 3 సార్లు హరిహర కృష్ణ ప్రేయసి ని పోలీసులు విచారించగా ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. . దీనితో ఆమెకు సఖి కేంద్రంలో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా కూడా ఆమె సహకరించ కుండా తనను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య కూడా చేసుకుంటానని ఏకంగా పోలీసులనే బెదిరించినట్లు తెలుస్తుంది.
కాగా ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణ (Hari hara krishna) ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న అతడిని పోలీసులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. అంతకుముందు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టును కోరారు. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా..7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీనితో హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
మరి హరి పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఈ కేసులో పోలీసుల విచారణ లో హరి హర స్నేహాతుడు హాసన్, హరి హర ప్రియురాలు ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో A1 గా హరిహర కృష్ణ ను A2 గా అతని ప్రియురాలు ను, A3 గా అతని స్నేహితుడు హాసన్ ను చేర్చి వాళ్ళని అరెస్ట్ చేశారు.
Comments
Post a Comment