ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వై ఎస్ ఆర్ సి పి పార్టీ శ్రేణులలో కలకలం రేపింది. దానికి కారణం వై ఎస్ ఆర్ సీపీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడమే.
![]() |
Vijayasai reddy tweet |
వై ఎస్ ఆర్ సీపీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి పార్టీ లో ఎంతో కీలకమైన వ్యక్తి. పార్టీ ప్రారంభం నుండి జగన్ వెంటే ఉండి పార్టీ ని పటిష్టం చేయడానికి ఎంతో కృషి చేశారు.
జగన్ తీసుకునే నిర్ణయాలు ను, పధకాలును ప్రజలకు చేరవేయడం లో కీలక పాత్ర వహించేవారు. ప్రతి పక్షాలు విమర్శలకు ఘాటు గా సమాధానం ఇచ్చేవారు. ముఖ్యం గా ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చేవారు.
ప్రతీ ఏడాది చంద్రబాబు పుట్టిన రోజున తన ట్విట్టర్ ద్వారా వ్యగ్యం గా పుట్టున రోజు శుభాకాంక్షలు చెప్పేవారు.
గత కొంతకాలం గా విజయ సాయి రెడ్డి చాలా సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గురించి ప్రకటనలు, అభిప్రాయాలు చాలా తక్కువ గా చేస్తున్నారు.
మరీ ముఖ్యం గా నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన సైలెంట్ అయ్యిపోయారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు చంద్రబాబు తో, బాలకృష్ణ తో కలిశారు విజయసాయి రెడ్డి. ఆ తర్వాత ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు నా శుభాకాంక్షలు తెలియచేసారు. అది కూడా చాలా చాలా గౌరవం గా. ప్రతిపక్ష నాయకుడి కి శుభాకాంక్షలు చెప్పడం తప్పు ఏమీ కాదు. కానీ గత సవంత్సరం శుభాకాంక్షలకు ఈ సవంత్సరం శుభాకాంక్షలకు ఎంత తేడా!! అని పార్టీ అభిమానులు గుసగుసలు లాడుకుంటున్నారు.
రాష్ట్రం లో తెలుగుదేశం, వైస్సార్ సీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలా ప్రతీ రోజు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటున్నాయి. ప్రతీ రోజు చంద్రబాబు సభలు పెట్టి జగన్ పై, ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్నటి కి నిన్న తెలుగుదేశం నాయకురాలు వంగలపూడి అనిత జగన్ పై తీవ్ర విమర్శలు చేసింది. మరో పక్క రామోజీ మార్గదర్శి పై సిబిఐ విచారణ కొనసాగుతూ ఉంది. ఇవ్వన్నీ ఇలా ఉండగా ఈ అంశాలు లో తెలుగుదేశం పై గాని, చంద్రబాబు పై గాని ఒక్కమాట కూడా విజయసాయి రెడ్డి మాట్లాడలేదు. కానీ చంద్రబాబు పుట్టిన రోజు కు మాత్రం ప్రేమ కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు.
విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రేమలో పడ్డారా? లేక బాబు వేసే రాజకీయ ఎత్తుగడలకు లొంగిపోయారా? అని పార్టీ అభిమానులు చర్చించు కుంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ పై విమర్శలు చేస్తూ ఉన్నా విజయసాయి రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ అంశం పై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!
సడన్ గా విజయసాయి రెడ్డి లో వచ్చిన ఈ మార్పు పై పార్టీ అభిమానులు వివిధ రకాలుగా చర్చ ఇంచుకుంటున్నారు. ఈ శుభాకాంక్షలు లు ను విజయసాయి రెడ్డి చంద్రబాబు బాబు కు దగ్గర అవుతున్నట్టు గా భావించాలా? లేక చంద్రబాబు వలలో విజయసాయి రెడ్డి చిక్కు కున్నట్టు అనుకోవాలా అని పార్టీ అభిమానులు ఆలోచనలో పడ్డారు. విజయసాయి రెడ్డి మనసులో మాట ఏమిటి అనేది ఆయన నోరు విప్పి చెప్తేనే తెలుస్తుంది.
Comments
Post a Comment