Skip to main content

నోట్లరద్దు సామాన్యునికి మేలా?

  



బిడ్డ పెళ్లికోసం యాదగిరి 6 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకున్నాడు. 2016 నవంబర్ 18 న అప్పటికప్పుడు    500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తో తీవ్ర ఒత్తిడి కి గురయ్యాడు. తన దగ్గర ఉన్న నోట్ల ను మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు లు పడ్డాడు.  నోట్ల రద్దు తో సామాన్యులు ఎదురుకున్న ఇబ్బందులకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పిల్లల పురుడు కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు దగ్గర ఉంచుకున్న ఎంతోమంది ఇలా ఇబ్బందులు పడ్డారు. 


నోట్ల రద్దు సామాన్యునికి మేలా? 


2016 నవంబర్ 18 న కేంద్రం ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్ధిక వ్యవస్థ ను అతలాకుతలం చేసింది. చెలామణి లో ఉన్న 500,1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా RBI ప్రకటించింది.


అప్పుడే 2000 రూపాయల నోట్లు ను చెలామణి లోకి కొత్తగా తెస్తున్నట్లు కేంద్రం లో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఆ నిర్ణయాన్ని దేశం లో ని చాలా మంది ఆర్ధిక వేత్తలు, మేధావులు, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీ లు తీవ్రంగా వ్యతిరేకించాయి.  కానీ బిజెపి ప్రభుత్వం దేశం లోని అవినీతి ని కట్టడి చేయాలన్నా , నల్ల ధనాన్ని రూపుమాపాలన్నా , నోట్ల రద్దె సరైన మార్గమని ఒక వర్గం మీడియా ద్వారా  విపరీతం గా ప్రచారం చేసింది. 



కానీ ఆ నోట్ల రద్దు ప్రభావం భారతీయ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్రంగా పడింది. భారత ఆర్ధిక వ్యవస్థ తిరోగమనం బాట పట్టింది. దేశం లోని చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు తీవ్రంగా ఆర్ధిక ఒడిదుడుకులు కు లోనయ్యాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఎంతో మంది ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడ్డారు. మరోపక్క దేశం లో ధరలు విపరీతం గా పెరిగి సామాన్యులు కు చుక్కలు కనపడ్డాయి. 


నెమ్మదిగా ఆర్ధిక వ్యవస్థ కోలుకుటుంది అనే లోపే కేంద్రం లొక్డౌన్ ప్రకటించడం దాని వలన మళ్ళీ దేశ ఆర్ధిక పరిస్థితి కుదేలు అవ్వడం మనము అందరం చూసిందే.


ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారి తిరోగమనం బాట పడితే మళ్ళీ కోలుకోవడానికి ఏళ్ళు పడుతుంది. ఆర్ధిక వ్యవస్థ కుదేలు అవ్వడం వలన వచ్చే ప్రభావం మొదట గా పడేది సామాన్యుని పైనే. 


 సరిఅయిన ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయం వలన తమ దగ్గర ఉన్న నోట్లు మార్చుకోవడానికి బ్యాంకు ల ముందు  సామాన్యులు రోజుల తరబడి వరసలో వేచి చూడవలసి వచ్చింది.  ఉద్యోగాలు, వ్యాపారాలు మాని బ్యాంకులకు పరిగెత్త వలసి వచ్చింది. తమ దగ్గర ఉన్న నోట్లు మార్చుకోలేము ఏమో అనే ఒత్తిడి కొంత మంది ప్రాణాలు తీసింది. 




నోట్ల రద్దు అనే ఒక్క ఒక్క నిర్ణయం దేశం లోని ఇంత గందరగోళం పరిస్థితులు కు కారణం అయ్యింది.


ఎంత హడావిడి గా నోట్ల రద్దు చేసిందో అంతే వేగంగా కొత్త 2000 రూపాయల నోట్లు ముద్రించి చాలామణీ లోకి తెచ్చింది.


ఇప్పుడు మళ్ళీ ఆ 2000 రూపాయల నోట్లు ను క్లీన్ నోట్ పాలసీ లో భాగం గా వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రకటించింది.


ఇప్పుడు దీని ప్రభావం   చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సామాన్యుల పైన ఉండనుంది.


అప్పడు రెండువేల రూపాయల నోట్లు ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం అని ప్రకటించి ఈరోజు వెనక్కి తీసు కోవడం ఏమిటని దేశం లోని ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిల తీస్తున్నాయి.  


రెండు వేల రూపాయల నోట్లు ప్రవేశ పెడుతున్నప్పుడే ఆర్ధిక వేత్తలు  కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. కానీ ఆరోజు ఇది అంతా దేశం మేలు కోసం అని ప్రకటనలు గుప్పించి నేడు 2000 నోట్లు ను వెనక్కి తీసుకోవడం వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు సామాన్యులకు కలుగుతున్నాయి. నల్లదనాన్ని రూపు మాపడం అనేది ఎలా ఉన్నా ప్రత్యక్షం గాను, పరోక్షంగా ను ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పవు.


నోట్ల రద్దు వలన మాత్రమే అవినీతి, నల్లదనం వెలికితీత జరిగితే 500,1000 రూపాయలు రద్దు తర్వాత దేశం లో నల్లధనం అనేది మోత్తం బయటికి వచ్చి ఉండాలి కదా!  కానీ ఆలా జరిగిందా? 



ఇప్పడు రద్దు అయిన నోటు ను మార్చుకోవడానికి మే 23 నుండి సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. ఒకరికి రోజుకు 20000/- రూపాయల వరకు మార్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. 


కేవలం నోట్ల రద్దు తోనే అవినీతి నిర్మూలన జరుగుతుంది అని ప్రపంచం లో ఏ దేశం లోను నిరూపించబడలేదు.  ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సామాన్యుల కు మేలు జరగాలి కానీ సమస్యలు సృష్టించకూడదు. కేంద్రం లో అధికారం లో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు వలన బలి అవుతున్నది మాత్రం సామాన్యుడే. 



- స్కంధ ధన్విక్ 






Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.