మొన్న కర్ణాటక లో "కర్ణాటక మిల్క్ ఫెడరేషన్" ను "గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్" ను విలీనం చేయాలనీ ప్రయత్నాలు చేసింది బిజెపి ప్రభుత్వం. కానీ అక్కడ ప్రతిపక్షాలు, రైతులు నుండి తీవ్ర నిరసన రావడం తో వెనక్కి తగ్గింది. ఇప్పుడు తమిళనాడు వంతు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు కేంద్ర మంత్రి అమితాషా కు లేఖ రాశారు. తమిళనాడు లో అమూల్ పాల సేకరణ వలన తలెత్తుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు.
అసలు ఈ అమూల్ వివాదం ఏంటి? అనేది తెలుసుకోవాలి అంటే మనము ముందుగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో అమిత్ షా చేసిన ప్రకటన తెలుసుకోవాలి. కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మొదటి మంత్రి అమిత్ షా “అమూల్ (గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్) ను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కలిసి కర్నాటకలోని ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక డెయిరీని నెలకొల్పేందుకు కృషి చేస్తాయని ప్రకటించడంతో వివాదం మొదలైంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని పేరుతో పాలను విక్రయస్తుంది. అమూల్ ను నందిని తో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కర్ణాటక లో ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.
కర్ణాటక ఎన్నికలకు నెల రోజుల ముందు
ఏప్రిల్ 5 న గుజరాత్ కు చెందిన మిల్క్ బ్రాండ్ అమూల్ తన వ్యాపార సామ్రాజ్యన్ని బెంగళూరు లో విస్తరించ బోతున్నట్టు ప్రకటించింది. అమూల్ చేసిన ఈ ప్రకటనతో నందిని పాల వ్యాపారం నాశనం అవుతుంది అని కర్ణాటక లోని రైతులు, ప్రతిపక్షాలు సేవ్ నందిని అంటూ ఉద్యమం చేశారు.
కర్ణాటక లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 25 లక్షల మంది రైతులకు ఉపాధి కల్పిస్తుంది. సుమారు 22000 గ్రామాలలో 14000 సహకార సంఘాలను కలిగి ఉంది. ప్రతీరోజు సుమారు 84 లక్షల లీటర్ల పాలు ను ఇది సేకరిస్తుంది. అమూల్ - నందిని విలీనం ప్రజల నుండి వ్యతిరేఖత వస్తుంది అని గమనించిన అప్పటి బిజెపి ప్రభుత్వ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయ్ " నందిని ని అమూల్ లో విలీనం చేస్తాము అనడం తప్పులు వార్తలు మాత్రమే. నందిని తన ప్రత్యేక గుర్తింపు ను ఎప్పుడూ కాపాడుకుంటుంది" అని ప్రకటించారు.
అయితే, స్థానికులు కర్ణాటకలో ప్రతిపక్షాల భయాలు కేవలం ఊహ జనీతమైనవి కావు. అమూల్ మరియు మరో ఐదు సహకార సంఘాలను విలీనం చేయడం ద్వారా బహుళ-రాష్ట్ర సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైందని అమిత్ షా అక్టోబర్ 2022లో సిక్కింలో ప్రకటించారు అని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
భారత రాజ్యాంగం ప్రకారం సహకార సంఘాలు రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. అయితే, జూలై 2021లో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన తర్వాత, బహుళ-రాష్ట్ర సహకార సంఘాలను ఏర్పాటు చేయడం గురించి ప్రకటనల కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సంఘాలను స్వాధీనం చేసుకోవడంపై ఆందోళనలు పెరిగాయి.
అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ విలీనం ఉండదు అని ప్రకటన చేసినప్పటికీ ఏప్రిల్ 5 న అమూల్ చేసిన ప్రకటన తో కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. అమూల్ ఉత్పత్తులు కొనవద్దు అని ప్రతిపక్షాలు ప్రకటించాయి.
కర్ణాటక ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ వివాదం కూడా ఒక కారణం అయ్యింది.
తమిళనాడు పాల సహకార సంఘం ఆవిన్ మిల్క్ షెడ్ ఏరియా నుంచి అమూల్ పాలను సేకరించకుండా చూడాలని తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆవిన్ పరిధిలోని పాలను అమూల్ సేకరిస్తే అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు మిల్క్ షెడ్ ప్రాంతంలో కైరా జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్(అమూల్) ద్వారా పాల సేకరణ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికె అమూల్ వ్యాపారం ప్రారంభంచింది.
రాష్ట్ర లలో ఉన్న పాల సహకార సంఘాలను అమూల్ లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. స్థానికం గా ఉన్న పాల సహకార సంఘాలను విలీనం చేసుకోవడం, ఆ తర్వాత రైతుల కు పాలు అమ్మడానికి ప్రత్యామ్నాయం లేకుండా చేయడం. తనకు నచ్చిన ధరకే కొనడం. దీనివలన పాడి నే నమ్ముకున్న రైతు రోడ్డున పడడం. మరోపక్క వినియోగదారులకు కూడా తనకు నచ్చిన ధరకే అమ్మడం ద్వారా లాభాలు గడించడం. ఇది అంత ఒక చక్ర వ్యూహం.
ఇలాంటి నిర్ణయాలు వలన, పాడి పరిశ్రమ నాశనం అవుతుంది.
- తటవర్తి భద్రిరాజు
Comments
Post a Comment