Skip to main content

రైతు పక్షపాతి కె సి ఆర్

 


తెలంగాణ పదవ వసంతం లోకి అడుగు పెడుతూ ఉంది . దేశం లో కొత్తగా ఏర్పాటు అయిన ఒక రాష్ట్రం ఇంత తక్కువ సమయం లో అభివృద్ది లో దేశానికి రోల్ మోడల్ గా నిలవడం అంటే సామాన్యమైన అంశం కాదు.  దీని వెనుక ముఖ్యమంత్రి కే సి ఆర్ ముందు చూపు, అకుంటిత దీక్ష స్పష్టంగా కనిపిస్తాయి. ఒక సమర్ధవంతమైన నాయకుడు ఉంటే ఫలితాలు, అభివృధి ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశానికి తెలంగాణ ఒక ఉదాహరణ.

ముఖ్యమంత్రి కె సి ఆర్ రైతు పక్షపాతి. తెలంగాణా రాష్ట్రం లోకి అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రాన్ని ఏవిధంగా సస్యశ్యామలం చేయాలి? బీడు భూముల లో ఏ విధంగా బంగారం పండించాలి? రైతు మోము లో ఎల్లప్పుడూ అనందం ఎలా తీసుకురావాలి అనే ఆలోచన తోనే ముందు అడుగు వేశారు. వ్యవసాయ రంగం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పధకాలు లో  వ్యవసాయానికి, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు.

తెలంగాణ కు కీర్తికిరీటం గా నిలిచేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి  బీడువారిన భూములను సస్య శ్యామలం చేశారు. ఒక్క ప్రాజెక్టు తో గోదావరి నీటిని తెలంగాణ లో 13 జిల్లాలకు సాగు నీటి కష్టాలు దూరమయ్యేలా, హైదరాబాద్ కు 30 టి ఏం సి ల తాగు నీరు చేరేలా చేశారు. గోదావరి నది నీటిని దిగువ నుండి ఎగువకు పంపింగ్ చేసి నిర్మించిన ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రపంచం లో ఎక్కడా నిర్మించ బడలేదు.
రాష్ట్రం లోని చెరువులు, కుంటలు, ఇంకుడు చెరువులు ,పునర్జీవింప  చేయడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

రైతులు వ్యసాయ పెట్టుబడులకు ఇబ్బందులు పడకూడదని పెట్టుబడి సాయం గా ఎకరాకు 10000 ఆర్ధిక సహాయాన్ని అందించే రైతు బందు పధకాన్ని ప్రవేశ పెట్టారు. సంవత్సరానికి రెండు విడతలుగా ఈ సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తూ ఉన్నారు.

రైతులకు 5లక్షల భీమా సౌకర్యం ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది. రైతులు ఒక్కరూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రైతుల తరుపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ ఈ పధకాన్ని అందుబాటులో కి తీసుకుని వచ్చింది.అంతే కాకుండా పంటల భీమా ను కూడా అమలు చేస్తూ ఉన్నది. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాలు అమలు పరుస్తూ రైతు కు వెన్నుముఖ గా నిలుస్తూ ఉంది.  దేశం లో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను అందిస్తూ వస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే.

రైతుల కోసం అదునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పత్తి పెరిగేలా ఏర్పాట్లు చేసింది తెలంగాణ  ప్రభుత్వం. ప్రతీ గ్రామంలో రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు అందించడం  తో పాటు , ఆధునాతన  వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉండేలా చేయడమే కాకుండా, వాటిని వాడడం కోసం రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది . అదునాతన యంత్రాల కొనుగోలు లో సబ్సిడీ లు అందించడం ద్వారా రైతు కు అడుగు అడుగు నా తోడ్పాటు అందించింది తెలంగాణ ప్రభుత్వం.   రైతులు పండించిన కూరగాయలు, పండ్లు రైతు బాజార్లు ద్వారా అమ్ముకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం, దళారుల పాత్ర ను రూపుమాపడం లో తెలంగాణా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. రైతుబందు సమితులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు వారి సమస్య ను గ్రామాలలో నే పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేసింది.

ఏ రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంచార పశు వైద్య శాలలు ఏర్పాటు చేసింది. దీనిద్వారా 100 అంబులెన్సు ల ద్వారా పశువులకు వైద్యం అందిస్తూ వస్తున్నది. వ్యవసాయ ట్రాక్టర్లపై పన్ను రద్దు చేయడం, రైతులకు డ్రిప్ సిస్టం కొనుగోలు లో సబ్సిడీ లు అందివ్వడం, రైతులు పంటలను అరబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణం గావించింది. నీటి తీరువా పన్ను ను రద్దు చేసింది.  ఒకటి అని కాదు చెప్పుకుంటూ పొతే తెలంగాణ  ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతు క్షేమం కోసం ముడిపడే ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వ ఈ పధకాలు, నిర్ణయాలు చూసే దేశం లోని ప్రజలు  కె సి ఆర్ లాంటి నాయకుడు కావాలని ఆలోచిస్తున్నారు.

రైతు సంక్షేమం కోరుకునే నాయకులు ఉన్నంత వరకు రాష్ట్రం అయిన , దేశం అయిన ఎప్పుడూ సస్యశ్యామలం గానే ఉంటాయి .

దేశం లో సాగు నీటి సమస్య ను, తాగు నీటి సమస్య ను ఎలా పరిష్కరించాలి అనే ప్రణాళిక ఇప్పటికె కెసిఆర్ ఆలోచనలలో ఉంది. స్వాతత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశం లో రైతు కోసం చిత్త శుద్ధితో పనిచేసిన ప్రభుత్వాలు లేవు.దేశం లో ఎన్నో వనరులు సమృద్ధి గా ఉన్నా వాటిని సరి అయిన విధంగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. సరి అయిన ప్రణాళిక తో ముందుకు నడిపించగల నాయకుల కొరత ఇక్కడే స్పష్టంగా కనపడుతూ ఉంది.

అందుకే   ఇప్పుడు దేశం లో ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారు. ఇటువంటి ఆలోచనలు ఉన్న సమర్ధుడు అయిన నాయకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి గా ప్రకటించినపుడు దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులు కె సి ఆర్ కు మద్దతుగా నిలిచారు. త్వరలోనే దేశం లోని రైతులకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. దేశం అభివృద్ధికి రాజకీయాలు  అడ్డురాకూడదు అంటూ ఎప్పుడూ చెప్పే కె సి ఆర్ లాంటి సమర్ధవంతమైన ముందు చూపు ఉన్న నాయకుడు  ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం. 

- తటవర్తి భద్రిరాజు
9493388940



Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.