Skip to main content

ఆంధ్రా ప్రజల చూపు ...కెసిఆర్ వైపు

 ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి . నిన్నటి వరకు ఉన్న ప్రజల ఆలోచనా విధానం లో మార్పులు వస్తున్నాయి . పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడు గా నిలబడతాడు అని నిన్నటి వరకు భావించారు .  వై ఎస్ ఆర్ సీపీ ప్రభుత్వ ఓటు ను జనసేన కొల్లగొడుతుంది అని  విశ్లేషకులు అనుకున్నారు  . ఐతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ , బిజెపి తో పొత్తు ఉంటుంది అని ప్రకటించడం తో జనసేన పార్టీ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము ఐయింది .

 రాష్ట్రము లో తెలుగుదేశం పార్టీ ని నమ్మడానికి ప్రజలు సిద్ధం గా లేరు .అవసరాన్ని బట్టి మాటలు మార్చే చంద్రబాబు ఆలోచన ధోరణి తో ప్రజలు విసుగెత్తి పోయారు . పైగా చంద్రబాబు  నోటు కు ఓటు కు సంబంధించిన అంశం ఇంకా ప్రజలు కూడా మర్చిపోలేదు .  పైగా లోకేష్ పాద యాత్ర  వలన   పార్టీ కి ఒరిగింది ఏమీ లేకపోగా ప్రజలలో లోకేష్ పై పార్టీ పై విరక్తి వచ్చింది . 

మత తత్వ చిచ్చు లు రేపి రాజకీయాలు చేసే బిజెపి ని కర్ణాటక లో ఓడించడం ద్వారా మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రజలు తరిమేశారు . ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలం అంతంతమాత్రం అది కూడా తెలుగుదేశం తో కలిస్తే , ఆ  ఓట్లు కూడా రాలవు .  

ఇక అధికారం లో ఉన్న వైస్సార్సీపీ పై ప్రభుత్వ వ్యతిరేఖ త అనేది ఎలానూ ఉంది . ఇటువంటి పరిస్థులలో ప్రజలు ప్రత్యామ్న్యాయం కోరుకుంటున్నారు . ఒక బలమైన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు . 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి లో , పధకాల అమలులు పక్కనే ఉన్న తెలంగాణ తో పోల్చుకుని చూసుకుంటున్నారు . రైతు పక్షపాతి అయిన కేసీర్ తెలంగాణ లో అమలు పరుస్తున్న పధకాలు , పంటలకు   గిట్టుబాటు ధరలు లభించేలా చేయడం , దళారీ వ్యవస్థ ను అరికట్టడం వంటి వి ఆంధ్రప్రదేశ్ రైతులను , ప్రజలను ఆకర్షింప చేస్తున్నాయి .  మరోపక్క కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ గా దేశం లో కూడా అధికారం లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు కూడా మేలు జరుగుతుంది . కేంద్రం నుండి రావాల్సిన ప్రత్యేక హోదా కూడా సాధించుకోవచ్చు అనే ఆలోచన ప్రజలలో ఉంది 


కెసిఆర్ వంటి నాయకుడు కావాలని తపన పడుతున్నారు .  కెసిఆర్  వంటి      నాయకుడు ఉంటే ఈ పాటికే రాష్ట్రానికి రాజధాని వచ్చేదని ఆలోచిస్తున్నారు . రాష్ట్రము లో వైస్సార్ సిపి కి కెసిఆర్ మాత్రమే గట్టి పోటీ ఇవ్వగల నాయకుడు అని అనుకుంటున్నారు . రాష్ట్రం లో అధికార ప్రతి పక్షాల నుండి చాల మంది నాయకులూ భారతీయ రాష్ట్ర సమితి లో చేరడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు . ఎన్నికల సమయం దగ్గర పడగానే ఇక భారతీయ రాష్ట్ర సమితి లోకి వలసలు ప్రారంభిస్తారు . 


తెలంగాణ రాష్ట్ర సమితి , భారతీయ రాష్ట్ర సమితి గా మారి జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలి అని అడుగులు వేస్తూ ఉంది . భారతీయ రాష్ట్ర సమితి గా మారగానే తెలంగాణ పక్క నే ఉన్న మహారాష్ట్ర లో రాజకీయ వలసలు ప్రారంభం అయ్యాయి . మహారాష్ట్రలో కీలక నాయకులు భారతీయ రాష్ట్ర సమితి లో చేరుతున్నారు . అక్కడి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు . దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రము లో కేసీర్ ప్రభుత్వం అమలు పరుస్తున్న పధకాలు . రైతుబంధు , దళిత బందు వంటివి పథకాలపై అక్కడి ప్రజలు ఎప్పటి నుండో ఆసక్తి కనబరుస్తున్నారు . ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా కనపడుతూ ఉంది . రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కెసిఆర్ కీలక భూమిక పోషించనున్నారు . ఈ అంశాన్ని గమనించిన రాష్ట్రము లో కొంతమంది అధికార పార్టీ నాయకులు వివిధ రకాలు గా తెలంగాణ మంత్రుల పై విరుచుకుని పడుతున్నారు . 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో వివిధ ప్రాంతాలలో కె సి ఆర్ ను వ్యక్తిగతం గా ఇష్టపడే ప్రజలు ఎంతో మంది ఉన్నారు . వివిధ సందర్భాలలో కేసీఆర్ కు బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు . జాతీయ పార్టీ గా అడుగులు వేస్తున్న భారతీయ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఒక్కక్క రాష్ట్రము లో పార్టీ ని కింది స్థాయి నుండి  నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉంది . ప్రస్తుతం మహారాష్ట్ర లో వివిధ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించింది .  త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా సభలు నిర్వహించే ఆలోచన లో భారతీయ రాష్ట్ర సమితి ఉంది అని వార్తలు వినబడుతున్నాయి . 


కెసిర్ భారతీయ రాష్ట్ర సమితి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనాలకు వేదికగా మారనుంది అని విశ్లేషకుల అభిప్రాయం .  


Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.