తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. జూన్ 2 వతేది నుండి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపోందించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాలలో సాధించిన ప్రగతి ని పల్లె పల్లె లో ప్రజలను భాగస్వాములు చేస్తూ సంబురాలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఈ తొమ్మిది ఏండ్ల లో సాధించిన ప్రగతి కి చిహ్నం గా ఈ దశాబ్ది ఉత్సవాలు ఉండనున్నాయి.
ఒక పక్క ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కు ఏర్పాట్లు చేస్తుంటే ప్రతి పక్షాలు మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాలు వలన భారత రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అని, ప్రజాధనం వృధా అయిపోతుంది అని విమర్శలు చేస్తూ ఉంది.
ఆత్మగౌరవానికి కోసం ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదవ వసంతం లోకి అడుగుపెడుతున్న వేళ సంబురాలు చేసుకోవడం తప్పేముంది. ఒకవేళ ఈ సంబురాలు వలన భారతీయ రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అనుకుంటే అది ఎందుకు చేకూరుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి.
ఈ దశాబ్ది ఉత్సవాలాలో తెలంగాణ ప్రభుత్వం తాను చేసిన అభివృద్ధి చెప్పినందుకు రాజకీయ లబ్ది చేకూరుతుంది అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందా లేదా తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి తెలంగాణ వచ్చే వరకు పోరాడిన కె సి ఆర్ ను ప్రజలు గుర్తు పెట్టుకోవడం వలన లబ్ది చేకూరుతుంది అని భావిస్తుందా? లేకుంటే రాష్ట్రం లో సాగు నీటి కష్టాలు లేకుండా కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టు గురించి ఈ ఊత్సవాల్లో ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడం వలన లబ్ది చేకూరుతుంది అని బిజెపి మదన పడుతుందా? ఒకవేళ నిజంగా వీటివలన రాజకీయ లబ్ది అనేది చేకూరితే అది తీసుకునే అర్హత పూర్తిగా భారతీయ రాష్ట్ర సమితికే ఉంటుంది.
తెలంగాణ లో ఈ తొమ్మిది ఏండ్ల లో దేశం లో ఎక్కడా జరగని అభివృద్ధి ని చేసి ప్రజల ముందు ఉంచడం ఏ విధంగా తప్పు? అభివృద్ధి చేయకుండా మాటలు తో, మీడియా మానేజ్మెంట్ తో నెగ్గుకుని వస్తున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మాటలతో కాకుండా చెప్పినదానిని ఆచరణలో పెట్టి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి ఫలాలు ను ప్రజలకు అందించింది.
ఈ తొమ్మిది ఏండ్ల లో జరిగిన అభివృద్ది ని చూసి ప్రజలు మళ్ళీ భారతీయ రాష్ట్ర సమితి కి పట్టం కడతారని భారతీయ జనతా పార్టీ కి అప్పుడే భయం ప్రారంభం అయింది అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ దశాబ్ది ఉత్సవాలు నుండి ప్రజల ద్రుష్టి ని మరల్చడానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు కూడా ప్రారంభంచింది. రాబోయే ఎన్నికలలో భారతీయ రాష్ట్ర సమితి అన్ని పార్టీ లతో కలిసి పోటీ చేస్తుంది అని ప్రచారం చేస్తూ ఉన్నారు బిజెపి నాయకులు.
పక్క నే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధికారం లో ఉన్న జగన్ ను రాబోయే ఎన్నికలలో ఓడించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడపోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ లతో అయిన కూటమిగా ఏర్పడవచ్చు కానీ ఇతర పార్టీ లు ఏ పార్టీ లతో ను కలవకూడదు అని బిజెపి ఆలోచన గా అనిపిస్తూ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎన్ని ఆసత్య ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు అవి ఏవి నిలబడవు. తప్పుడు ప్రచారాలు చేసే పార్టీ లకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.
Comments
Post a Comment