"కె సి ఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి" అని తెలంగాణ పి సి సి అధ్యక్షుడు రేవంతరెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రం లో కాంగ్రెస్ ను అధికారం లోకి తీసుకుని రావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత రేవంత్ రెడ్డి నోటి వెంట ఇటువంటి మాటలు రావడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. తెలంగాణ లో కూడా అధికారం లోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ కు కర్ణాటక ఫలితాలు కొత్త ఆశలు పుట్టించాయి. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే రేవంత్ మాటలు కానీ, తెలంగాణ కాంగ్రెస్ ఆశలు కానీ గాలి లో మేడలు కట్టినట్టే అని అర్ధమవుతుంది.
కర్ణాటక లో కాంగ్రెస్ గెలవడానికి అక్కడ అనేక అంశాలు దోహదం చేసాయి. ఆ పరిస్థితులు తెలంగాణ లో లేవు. అక్కడ అధికారం లో ఉన్న బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పై వచ్చిన 40 శాతం కమీషన్ ఆరోపణలు ప్రజలను ఆలోచింప చేసాయి. మరోపక్క ధరల పెరుగుదల, బిజెపి చేసే మత తత్వ రాజకీయాలకు విసుగు చెందిన ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు.
హలాల్, హిజాబ్, అజాన్‌తోపాటు
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ‘బజరంగ్ దళ్’ అంశాన్ని కూడా బిజెపి రాజకీయాస్త్రంగా వాడుకుని లబ్ది పొందాలి అని చూసింది కానీ ఇవన్నీ బిజెపి కి కలిసి రాకపోగా వ్యతిరేఖంగా పనిచేసాయి.
తొమ్మిదేళ్ల క్రితం వరకు తెలుగు నేలపై ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో మాత్రమే ప్రతిపక్ష హోదాలో నెట్టుకువస్తోంది. అయితే కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా పోటీ అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్యగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల పోటీ నుంచి తప్పుకుని మూడో పెద్ద పార్టీగా సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మునుగోడు ఉపఎన్నిక లో మనము ఈ విషయాన్ని చూసాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులు లో భారతీయ రాష్ట్ర సమితి పై గెలిచి అధికారం చేపట్టడం కాంగ్రెస్ కు పగటి కలలు కనడం వంటిదే.
రేవంత్ చెప్పినట్టు కేసిఆర్ వ్యతిరేకంగా ఉన్న శక్తులు అన్నీ కలిసిన ఇది సాధ్యం కాదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దల నుండి అనుమతి రావాలి. ఇక్కడి ప్రజల మనోభావాలు అభీష్టాలు ఢిల్లీ లో ఉన్న పెద్దలకు ఏమి అర్ధం అవుతాయి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వారి చేతులలో తాకట్టు పెట్టడమే. ఇది తెలంగాణ లో కాంగ్రెస్ ఉనికి లోకి రావడానికి కు పెద్ద అడ్డంకి.
కాంగ్రెస్ పార్టీ లో ఉన్న లీడర్లు మధ్య కొరవడిన ఐకమత్యం ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రజలు చూసారు. బహిరంగ బహ బాహీ లు పార్టీ ముందుకు వెళ్ళడానికి అడ్డంకి గా మారుతాయి. గత కొంత కాలం గా రేవంత్ ను కొంత మంది సీనియర్లు ఒంటరి ని చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
గతం లో రేవంత్ ఓటు కు నోటు కేసులో ప్రజాస్వామ్యం ని ఏవిధంగా గా అబాసు పాలు చేశారు అనేది ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇది కూడా కాంగ్రెస్ రేసుకు పెద్ద అడ్డంకి.
పి సి సి అధ్యక్షుడు కు ఆ పార్టీ లో సీనియర్లు చాలా మందికి ఉన్న విబేధాలు రేవంత్ ఆశలకు కు అడ్డుతగులుతూ ఉంటాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేది ప్రకటించడానికి కూడా కాంగ్రెస్ ధైర్యం చేయదు. ఆలా ప్రకటిస్తే పార్టీ లో సీనియర్లు మధ్య వచ్చే కుమ్ములాటలు అందరికీ తెలిసినవే. నిన్న రేవంత్ ప్రెస్ మీట్ లోనే సీనియర్ నేత హనుమంతరావు రాజీవ్ నన్ను సి.యం చేద్దామనుకున్నారు అంటూ ఆయన మనసులో ని మాటను చెప్పకనే చెప్పారు. సి. యమ్ అభ్యర్థి తెలియకుండా ప్రజలు ఓట్లు రాలాలి అనుకోవడం కూడా పెద్ద హాస్యాస్పదం.
రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావం తెలంగాణ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మునుగోడు ఫలితాలపై ఇది స్పష్టంగా కనపడింది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ లో అద్భుతాలు చేస్తుంది అనుకోవడం ఊహల పల్లకిలో ఊరేగడమే.
ఒకవేళ ఈ ఇంటి సమస్యలను పరిష్కరించుకుని కాంగ్రెస్ బయటకు వస్తే అపర రాజకీయ చాణిక్యుడు కేసిఆర్ తో రాజకీయం గా పోటీ పడడం కూడా కష్టమే.
మరోపక్క తెలంగాణ లో అభివృద్ది ని శర వేగంతో తెలంగాణ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తూ ఉంది. రాష్ట్రం లో పెద్ద పెద్ద కంపెనీ ల పెట్టుబడులు వస్తున్నాయి. దీనితో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసున్న సంక్షేమ పధకాలు తో ప్రజలు కూడా సంతృప్తి గా ఉన్నారు. మరోసారి కేసిఆర్ ని ముఖ్యమంత్రి గా చేయాలనీ తపన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు లో కాంగ్రెస్ అడుగులు ముందుకు పడడం కష్టమే.
తెలంగాణ లో ప్రభుత్వ పరిపాలన తో ప్రజలు చాలా సంతృప్తి గా ఉన్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వివిధ పధకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ ఉంది.
ప్రభుత్వ చేస్తున్న అభివృద్ది పనులు ప్రజలు చూస్తూ ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులు లో ఎక్కడ ఎక్కడో, ఏవేవో పార్టీ లలో ఉన్న నాయకులను కూడ గట్టుకుని, బలం పుంజుకుని, ప్రజల మనసు దోచుకుని రాజకీయ చదరంగం లో పావులు కదుపుతూ అధికారం చేపట్టాలి అనుకోవడం తప్పుకాదు కానీ ఊహల పల్లకిలో ఊరేగడమే.
Comments
Post a Comment