ఏ ప్రభుత్వానికి అయిన ప్రాధమిక లక్ష్యం ప్రజా ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు.
వీటిని ప్రజలకు అందించిన ప్రభుత్వాలు ప్రజలు మనసు దోచుకో గలుగుతాయి. పది కాలాలు పాటు పరిపాలించగలుగుతాయి. ఆలా పరిపాలన అందించిన నాయకులు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఇది నగ్న సత్యం.
దేశం లో ఎక్కడా లేని విధంగా గా వినూత్న రీతిలో సంక్షేమ పధకాలు చేపట్టడం లో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుంది. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టే పధకాలు కేవలం అరంభ సూరత్వం గా కాకుండా వాటి ఫలితాలు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ చేరాలి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ర్ ఆలోచన తో రాష్ట్రం లో ఎన్నో పధకాలు చిగురించి వికసిస్తూ ఉన్నాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనే మాట మనకందరికీ తెలిసిందే. అంటే అన్ని ఇంద్రియాలలో కళ్ళు ఎంతో ముఖ్యమైనవి. దీనిని ద్రుష్టి లో పెట్టుకుని రాష్ట్రం లో ఆంధత్వం అనేది లేకుండా చేయాలి అనే లక్ష్యం తో ప్రజల్లోకి తీసుకుని వచ్చిన పధకం కంటి వెలుగు. ఇప్పటిదాకా ఈ పధకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. కంటి సమస్యలు ఉన్నవారిని పరీక్ష చేయడం, అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ, కంటి ఆపరేషన్లు నిర్వహణ, కంటి సమస్యలు రాకుండా అవసరమైన మందుల పంపిణీ, కంటి సమస్యల పై అవగాహన కల్పించడం ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం. కేవలం ఒక్క ఆధార్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పూర్తి ఉచితం గా ఈ సేవలు అన్నీ కంటి వెలుగు లో లభిస్తున్నాయి.
రాష్ట్రం లో ఆంధత్వ నివారణ ముఖ్య లక్ష్యం గా ప్రారంభిన కంటి వెలుగు పధకం తన లక్ష్యానికి చేరువలో ఉంది.
మొదటి విడత గా మెదక్ జిల్లా మల్కాపూర్ లో 2018 ఆగష్టు 15 వ తేదీ న ఈ పధకం ప్రారభించడం జరిగింది. దాదాపు 8 నెలల లో కోటి యాభై లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా తన లక్ష్య సాధనలో ముందు అడుగు వేసింది. అంతే కాకుండా 50 లక్షల మందికి ఉచిత కళ్ళ అద్దాలు మొదటి విడత లో అందించింది తెలంగాణ సర్కార్.
తదుపరి 2023 జనవరి 18న రెండవ విడత కంటి వెలుగు కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇప్పటివరకు సుమారు కోటి యాభై లక్షలు మందికి కంటి పరీక్షలు, 21 లక్షల మంది కి అవసరమైన కంటి అద్దాలు అందించింది ఈ పధకం. ఈ విడత పూర్తి అయ్యేసరికి సుమారు రెండు కోట్ల మంది ప్రజలు ఈ పధకం ద్వారా లబ్ది పొందుతారు.
ఎంతో మంది పేద వారు వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేక, దూరంగా ఉండే పట్టణాలకి వైద్యం కోసం వెళ్లలేక కళ్ళు కనపడక పోయినా అలానే జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి వారికోసం గ్రామాలలోనే కంటి వెలుగు శిభిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తున్నారు. చూపు మందగించిన వారికి అవసరమైన వైద్యం చేస్తున్నారు.
నేను వ్యక్తి గతం గా ఈ పధకం అమలు గురించి చాలా మంది తో మాట్లాడాను. ఎవరిని కదిపినా ఈ కంటి వెలుగు పధకం గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా వీరి మాటలు ద్వారా తెలుసుకున్న మరో అంశం ఏమిటంటే, ఒకవేళ వైద్య పరీక్షల సమయం లో పెషేంట్ కి సరిపోయే కళ్ళ అద్దాలు అందుబాటులో లేకపోతే తదుపరి పదిహేను రోజుల్లో ఆశా వర్కర్స్ ద్వారా పెషేంట్ ఇంటికే ఆ కళ్ళ అద్దాలు పంపడం. మరోసారి కంటి సమస్య ఉన్నవారు వైద్యుల చుట్టూ తిరగకుండా చేసిన ఈ ఏర్పాటు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
కేవలం తెలంగాణ రాష్ట్రం లోనే ఇటువంటి పధకం ఇంత విజయవంతం గా నిర్వహించ బడుతూ ఉంది. ప్రభుత్వ వైద్యులు, అధికారులు ఎంతో అకింతభావంతో ఇందులో పాల్గొంటూ ఈ పధకాన్ని విజయవంతం చేస్తున్నారు.
ఈ విడత పూర్తి అయ్యేసరికి సుమారు రెండు కోట్ల మంది జీవితాల్లో 'కంటి వెలుగు' వెలుగులు నింపుతుంది.
ఒక మంచి ఆలోచన సమాజం లో మార్పు తీసుకుని వస్తుంది. ఎంతో ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఈ కంటి వెలుగు రాబోయే రోజుల్లో మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపాలి అని మనసారా ఆకాంక్షిద్దాం.
Comments
Post a Comment