Skip to main content

Posts

Showing posts from March 2, 2023

Guava leafs : పండే కాదు ఆకులు కూడా ఆరోగ్య సంజీవనే!

జామ పండు రుచి నచ్చని వారు ఎవరూ ఉండరేమో! జామ పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.  అయితే, జామ చెట్టు ఆకులు కూడా మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని మీకు తెలుసా? జామ ఆకులలో (Guava leafs)అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా మెరుగుపరుస్తాయి. ఈ వ్యాసం లో  జామ ఆకుల (Guava leafs health benifits )వల్ల కలిగే ప్రయోజనాలను,  జామ ఆకులను  నిత్యం ఏవిధంగా వాడుకోవచ్చో తెలుసుకుందాం. Guava Leafs Health Benifits  రోగనిరోధక శక్తిని పెంచుతుంది జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  ఇది హానికరమైన వ్యాధికారక,  ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  వివిధ వ్యాధులు నివారణలో సహాయపడుతుంది.  జీర్ణక్రియలో సహకరిస్తుంది జామ ఆకులలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుం

Naveen murder : ప్రేయసి కోసమే హత్య

 Naveen murder : హైదరాబాద్ శివారులోని అబ్దులాపూర్ మెట్ లో నవీన్ అనే యువకుడి హత్య రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం రేపింది.  హరి హరే కృష్ణ, తన ప్రియురాలికి నవీన్ దగ్గరవుతున్నాడని పార్టీ పేరుతో పిలిచి  కిరాతకంగా హత్య చేశాడు.  నవీన్  ను హత్య చేసిన తర్వాత శరీర భాగాలను కోసి వాటిని ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు.     హరిహర ఎక్కువగా క్రైమ్ సిరీస్ లు చూసి పక్కా పథకంతోనే నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. పక్కా పధకం ప్రకారం జరిగిన ఈ హత్య తెలంగాణ రాష్ట్రం మొత్తం  ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ హత్యలో హరిహర ప్రేయసి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.   నవీన్ హత్య (naveen murder)  కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనం లో తెలుసుకోండి. Naveen Murder Case : నవీన్, హరిహర కృష్ణ స్నేహాతులు. ఒకే కళాశాల లో చదువుతున్నారు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈ ఇష్టమే ఇప్పుడు నవీన్ ప్రాణాలను బలిగొంది. హరిహర కృష్ణ తాను ప్రేమించిన యువతి కి నవీన్ కూడా దగ్గరగా ఉండడం సహించ లేకపోయాడు. రోజు కలిసి తిరిగినా మనసులో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్ ను అంతం చేయాలని ప్రణాళికసిద్ధం చేసుకున్