Skip to main content

Posts

Showing posts from March 12, 2023

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.