ఒకప్పుడు గుండెపోటు అంటే 60 లు దాటిన వారికే వస్తాయి అనే అపోహ ఉండేది. కానీ ఈ మధ్యకాలం లో వయసు తో నిమిత్తం లేకుండా గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఉన్నట్టు ఉండి కుప్పకూలి మరణిస్తున్నారు. ఒక చేదు నిజం ఏంటి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 90 సెకన్లు కు ఒకరు గుండెపోటు లేదా కార్దియాక్ అరెస్ట్ తో మరణిస్తున్నారు. ఇలా గుండె పోటు తో మరణించిన వారిలో కాలేజీ విద్యార్థులు దగ్గర నుండి పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ గుండెపోటు మరణాలు కలవర పెడుతున్నాయి. కరోనా వచ్చిన వారికే ఇలా జరుగుతుందా ? లేదా కరోనా వైద్యం సమయం లో స్టిరాయిడ్స్ వాడడం వలన ఇలా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. Heart attacks తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుండెపోటు వచ్చిన వెంటనే చేసే సీపీర్ ఎలా చేయాలో శిక్షణ కార్యక్రమాలు ను త్వరలోనే ప్రారంభించనుంది. గుండెపోటు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం... ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం గుండెపోటు. సాధారణంగా రక్తం గడ్డకట్టడం ద్వారా గుండె కండరాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు గుండె పోటు సంభవిస్తుంది. రక్త ప్రసరణ లేకపోవడం గుండె కండరాలకు శాశ్వత నష్టం కల
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.