మీ గుండె మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన కండరం. ఎక్కువ కాలం ఆరోగ్య ఉండాలి అంటే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అంటే గుండె ఆరోగ్యం గా ఉండడం ఎంతో అవసరం. మీ హృదయాన్ని పది కాలాలు పాటు పదిలంగా ఉంచుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలు ఈ వ్యాసం లో చూద్దాము. హృదయం : పదికాలాలు పదిలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: మీ గుండె ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. శరీరానికి శ్రమ అవసరం. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి అని లక్ష్యంగా పెట్టుకోండి. దీన్ని వారంలో చిన్న చిన్న బాగాలుగా చేసి వారం పూర్తి అయ్యేసరికి పూర్తి చేయండి. ఆరోగ్యకరమైన ఆహరం : గుండె-ఆరోగ్యం కోసం ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోండి. . ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక మొత్తంలో చక్కెర మరియు ఉప్పు లను దూరంగా ఉంచండి. దూమపానా నికి దూరంగా ఉండండి : పొగతాగే అలవాటు ఉన్నవారికి గుండె సంబంధ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గుండె ను ఆరోగ్యం గా ఉంచుకోవాలి అనుకుంటే దూమపానానికి దూరంగా ఉండండి. ఒత్తిడి కి
తెలుగు రిపోర్టర్... విజ్ఞానం... వినోదం... ఆరోగ్యం ల త్రివేణీ సంగమం.