హైద్రాబాద్ లో ఉచితం గా ఇంటర్నెట్ !

 హైద్రాబాద్ లో ఉచితం గా ఇంటర్నెట్  అందిస్తున్న  act fiber net 


3000 ఉచిత వైఫై జోన్స్ ఏర్పాటు 


ఇంటర్ నెట్ నేటి కాలం లో ఎంత అవసరమో మనకు అందరికీ తెలిసిందే. మొబైల్ లో ఇంటర్ నెట్ లేనిదే మనం ఇంటి గుమ్మం దాటి బయటకు కూడా వెళ్ళము. నిత్యం ఎన్నో అవసరాలకు ఇంటర్ నెట్ వాడుతూ ఉన్నాము. ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ act fiber net  హైద్రాబాద్ వాసుల కోసం ఉచిత వైఫై జోన్స్ ను ఏర్పాటు చేసింది. హైద్రాబాద్ లో act fiber net ఉచిత ఇంటర్ నెట్ ను అందిస్తుందిఇకపై ఇంటిదగ్గరే కాకుండా హైద్రాబాద్ నలుమూలలా ఇంటర్నెట్ సేవలను ఉచితం గా పొందవచ్చు అని act fiber నెట్ తెలిపింది. ఉచిత ఇంటర్నెట్ ను నగర వాసులు కు అందించడానికి నగరం నలుమూలలా ఉచిత wifi జోన్స్ ను ఏర్పాటు చేసింది.  నగర వ్యాప్తం గా మూడువేల కు పైగా  wifi జోన్స్ ను act fiber net ఏర్పాటు చేసింది.

GHMC, Act fiber సంస్థల సంయుక్త ప్రాజెక్ట్ప్రభుత్వం GHMC Act fiber net లు  కలిసి hy-fi అనే ప్రాజెక్ట్  ను చేపట్టాయి. దీనిలో భాగం గా హైద్రాబాద్ మొత్తం మూడువేల కు పైగా ఉచిత wifi జోన్స్ ను ఏర్పాటు చేశారు. ఆగస్టు మొదటివారం లో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ hy-fi ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ hi-wi ఇంటర్ నెట్ జోన్ లో ఎవరైనా 45 నిముషాల పాటు ఇంటర్ నెట్ ను  ఉచితం గా వాడుకోవచ్చు. 25 mbps స్పీడు తో ఈ వైఫై జోన్స్ ల దగ్గర ఇంటర్నెట్ ఉచితం గా లభిస్తుంది. ఇక్కడ ఇంటర్ నెట్ వాడుకునే వారు గరిష్టంగా 1 జీబీ డేటా ను వాడుకోవచ్చు.

Act fiber తీసుకువచ్చిన కొత్త టెక్నాలజీ


Act fiber net act smart techonogy సాయం తో తమ వినియోగదారులకు ఇంటి బయట కూడా ఈ ఫ్రీ వైఫై జోన్స్ వద్ద ఇంటర్ నెట్ వాడుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంది. తమ వినియోగదారులు ప్రస్తుతం ఉన్న ఇంటర్ నెట్ స్పీడ్ ను ఈ వైఫై జోన్స్ వద్ద కూడా వాడుకునే వెసులుబాటు ను act fiber net కల్పించింది. సాధారణ వినియోగదారులకు కేవలం 45 నిముషాల పాటు ఇంటర్ నెట్ అందితే, act వినియోగదారులకు తమ తమ ప్లాన్ లను అనుసరించి ఈ act wifi zones వద్ద  అపరిమితం గా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. హైద్రాబాద్ లో ఉన్న  47 మెట్రో రైల్వే స్టేషన్ ల వద్ద కూడా ఈ ఉచిత wifi సౌకర్యాన్ని act fiber net అందుబాటు లోకి తీసుకు వచ్చింది.  

వరంగల్ లో కూడా ఉచిత వైఫై జోన్స్ ను ఏర్పాటు చేసినట్టు act fiber net ఒక ప్రకటనలో తెలియచేసింది. వరంగల్ , హనుమకొండ , కాజీపేట ల పరిధిలోని కళాశాలలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ లు వద్ద ఈ ఉచిత wifi zones ను act ఏర్పాటు చేసింది. వరంగల్ పరిధిలో మొత్తం 18 వైఫై జోన్స్ ల వద్ద ఉచితంగా ఇంటర్ నెట్ ను వినియోగించవచ్చు అని act fiber net తెలిపింది.

ఉచిత వైఫై ఎలా వాడుకోవాలి ?


హైద్రాబాద్ , వరంగల్ పరిధిలోని ఉచిత వైఫై ని వాడుకోవాలంటే ముందుగా hifi zone పరిధి లో ఉండాలి. ఆ తరువాత wifi సెట్టింగ్స్ లో HI-WI ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత తెరపై కనపడే మెనూ లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి , మొబైల్ కు వచ్చే వన్ టైం password ను ఎంటర్ చేయాలి.

Act వినియోగదారులు ఐతే తమ తమ ప్లాన్ ల ప్రకారం అదే వేగం తో  ఇక్కడ కూడా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. సాధారణ వినియోగదారులు 45 నిముషాల పాటు ఉచిత ఇంటర్ నెట్ ను పొందవచ్చు. ఐతే పరిమితి ముగిశాక 25 రూపాయల , 50 రూపాయల టాప్ అప్ తో ఇంటర్నెట్ ను పొందవచ్చు. 

హైద్రాబాద్ లో ని ఉచిత వైఫై జోన్స్ ల వద్ద ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

Comments