కార్టూనిస్ట్ శ్రీధర్ తదుపరి అడుగులు ఎటువైపు ?

 కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ ఈనాడు దిన పత్రికకు రాజీనామా చేశారు.గత రెండు రోజుల క్రితమే ఆయన ఈనాడు కు రాజీనామా చేశారు. ఆయన ఈనాడు లో పనిచేసినంత కాలం ఈనాడు అంటే శ్రీధర్, శ్రీధర్ అంటే ఈనాడు అన్నట్టు గా పేరు తెచ్చుకున్నారు. శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడు ను పాఠకులు ఎలా స్వీకరిస్తారనేది వేచిచూడాలి. 


కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడు దిన పత్రికకు రాజీనామా చేశారుశ్రీధర్ ఈనాడు లో రాజీనామా చేసిన తరువాత ఆయన తదుపరి ప్రణాళికలు ఏమిటి ?  అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. మీడియా వర్గాల్లో ఈ అంశం పై ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి. ప్రముఖ తెలుగు వార్త పత్రిక, ఒక ఆంగ్ల వార్త పత్రిక శ్రీధర్ సేవల కోసం సంప్రదించినట్టు వార్తలు ప్రచారం లో ఉన్నాయి. కానీ శ్రీధర్ వాటిని దృవీకరించలేదు. ఎంత పెద్ద ఆఫర్స్ వచ్చిన శ్రీధర్ ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.   కేవలం ఆయన విశ్రాంతి తీసుకోవడానికే ఈనాడు పత్రికకు రాజీనామా చేశారని ఇకపై ఒక ఆర్ట్ స్కూల్ ప్రారంబించే ఆలోచన ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్పినట్టు సోషల్ మీడియా లో వార్త కధనాలు వస్తున్నాయి. శ్రీధర్ నోరువిప్పితే కానీ ఈ సస్పెన్సు కి తెరపడదు.

Comments