పతనం దిశగా పయనం - శ్రీలంక

ప్రకృతి తో పరవసించే అందమైన దేశం. చుట్టూ సముద్రం. చాలా పరిశుభ్రం గా కనిపించే నగర వీధులు. స్నేహపూర్వక ప్రజలు. చరిత్రని చెప్పే కట్టడాలు ఇవన్నీ శ్రీలంక పేరు చెప్తే గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా ఆకలి, అశాంతి రాజ్యమేలుతున్నాయి. 

ఆర్ధిక పతనం వైపు పయనిస్తున్న శ్రీలంక పరిస్థులు పై 
భద్రిరాజు తటవర్తి అందిస్తున్న కథనం 

ద్వీప దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.  అత్యంత దారుణమైన   ఆర్ధిక సంక్షోభం లో ఉంది. విదేశాల నుండి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారక నిల్వలు అడుగింటి పోయాయి. దేశం లోని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శ్రీలంక ఈ ఆర్ధిక సంక్షోభం లో చిక్కుకోవడానికి కారణాలు ఏమిటి ? అనే అంశాలు పరిశీలిస్తే ఎన్నో అంశాలు కనిపిస్తాయి. ప్రపంచం లోని అన్ని దేశాలు కోవిడ్ వలన చాలా ఇబ్బందులు పడ్డాయి. ఆర్థికం గా కుదేలు అయ్యాయి. శ్రీలంక పర్యాటక రంగం పై ఆధారపడి ఉండే దేశం. కోవిడ్ వలన విదేశీ పర్యాటకులు శ్రీలంక రావడం తగ్గిపోయింది. దీనివలన పర్యాటక రంగం కుదేలు ఐయింది. కోవిడ్ ఒకటే శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి కారణం అని మీరు భావిస్తే తప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే ఈ పరిస్థితులు ఈ ఒకటి రెండు ఏళ్లలో వచ్చినవి కాదు. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వామ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కు , ఎప్పటి నుండో ఉన్న ఆర్ధిక పతనానికి ఆధ్యం పోసాయి. 

ప్రధానం గా ఇక్కడ ఉన్న వారసత్వ రాజకీయాలు అవినీతి మయం. అధికారం లో ఉన్న నాయకులు స్వలాభం కోసం దేశ ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టగలరు. పొరుగున ఉండే చైనా వేసే వలలో ఇలానే చిక్కుకున్నారు శ్రీలంక నాయకులు. అవసరానికి శ్రీలంక ఇచ్చిన అప్పులు తీసుకుని నేడు వాటికి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థులలోకి నెట్టబడ్డారు. దేశం లో చాపకింద నీరులా వ్యాపించిన ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరలను ఆకాశానికి తీసుకుని వెళ్ళింది. గడిచిన రెండేళ్లలో విదేశీ మారక నిల్వలు 70 శాతం హరించుకు పోయాయి.  2019 లో ప్రభుత్వం ప్రజలకు పన్ను తగ్గింపులు ప్రకటించింది. దీనివలన ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ఈ సవంత్సరం జనవరి నుండి పరిస్థులు మరింత దిగజరిపోయాయి. ఆహారం , నూనె ల ధరలు అదుపుచేయలేనంత గా పెరిగిపోయాయి. దేశం లో నిత్యావసర లు  నిల్వలు లేకపోవడం తో ఈ పరిస్థితి వచ్చింది. 

2.2 మిలియన్ జనాభా ఉన్న ద్వీప దేశం శ్రీలంక నేడు నిత్యావసరాలు అయిన బియ్యం, కిరోసిన్ , పాలు కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రజల్లో అసహనం కోపం తారాస్థాయికి చేరుకున్నాయి. దేశం లో చాలా చోట్ల పెట్రోల్ బంక్ ల వద్ద సైన్యాన్ని కాపలా గా పెట్టి పరిస్థితులు ను అదుపు చేస్తున్నారు. 

ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సే తీసుకున్న కొన్ని పాలనా పరమైన తప్పిదాల వలనే నేడు ఈ పరిస్థితి వచ్చింది అని ఆర్ధిక నిపుణులు తెలియచేస్తున్నారు. 

పన్ను తగ్గింపులు చేసి ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. అవసరానికి మించి ప్రభుత్వం నగదును ముద్రించింది. దీనికి తోడు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తు ఉత్పత్తి లపై ఆంక్షలు విధించింది. విలాసవంతమైన కారులు, రసాయన ఎరువులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తవులు పై    విధించిన ఆంక్షలు వలన దేశం లో పరిస్థులు చక్కబడి విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి అని ప్రభుత్వం భావించింది. 

2020 మార్చ్ నుండి అన్నిరకాల విదేశీ వాహనాలు దిగుమతి చేసుకోవడం పై నిషేధం విధించింది శ్రీలంక సర్కార్. నిషేధానికి ముందు 400 మిలియన్ డాలర్స్ ని రసాయన ఎరువుల దిగుమతి కోసం ఖర్చుచేసేది. అలాగే 1.5 బిలియన్ డాలర్ల ను వాహన దిగుమతి కోసం చెల్లించేది. 

ప్రభుత్వం ఈ నిషేదం వలన దేశం లో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి, విదేశీ మారక నిల్వలు అందుబాటులో ఉండడమే కాకుండా విదేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయి అని భావించింది. 

కానీ పరిస్థులు మరింత దిగజారి జనవరి చివరినాటికల్లా తనదగ్గర ఉన్న బంగారం నిల్వలు కూడా అమ్మవల్సి వచ్చింది. 

ఎప్పటి నుండో దిగుమతుల మీద ఆధారపడి ఉన్న శ్రీలంక లో , దిగుమతుల  నిషేధం వలన పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింది. ముడిసరుకు లేక పరిశ్రమలు లో ఉత్పత్తి మందగించింది.  దీని ప్రభావం ఎన్నో పరిశ్రమలతో పాటు ముఖ్యం గా ఆభరణాలు తయారు చేసే రంగం పై తీవ్ర ప్రభావం చూపింది.

" ముడి సరుకులు లేక పోతే నాణ్యమైన వస్తువులను ఎలా తయారు చేయగలరు ? "  అని యూనివర్సిటీ ఆఫ్ కొలంబో లో ప్రొఫెసర్ గా పనిచేసే కోపాలపిళ్ళై అమృతలింగం అన్నారు. 

శ్రీలంక   కోవిడ్ వలన పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది.  దీనికితోడు దిగుమతుల నిషేధం, పన్నుల తగ్గింపు మరింత ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది. 

శ్రీలంక దిగుమతుల అంశంలో క్రమశిక్షణ లేకపోవడమే ఈ సంక్షోబానికి కారణం అని నిపుణులు తెలియచేస్తున్నారు. 
2021 లో శ్రీలంక 6బిలియన్ డాలర్స్ ను వెన్న, పళ్ళు, కూరగాయలు, ఐస్క్రీమ్స్ చోకోలేట్స్ వంటి  నిత్యావసరాలు  దిగుమతి కోసం ఖర్చుచేసింది.  386 మిలియన్ డాలర్ల మొబైల్ ఫోన్ ఉత్పత్తులు ను దిగుమతి చేసుకుంది. 

"దేశం ప్రస్తుతం డాలర్ల ల సంక్షోభం ఎదుర్కొంటుంది. మనం ప్రస్తుతం 100 డాలర్లు ను సంపాదిస్తుంటే, 115 డాలర్ల ను అప్పుచేసి చెల్లించాల్సి వస్తూ ఉంది."  అని శ్రీలంక పర్యావరణ శాఖా మంత్రి మహీందా అమరేశ్వర మీడియా తో అన్నారు.

విదేశీ అప్పులు, సావరీన్ బాండ్ల చెల్లింపు లు ఇప్పుడు దేశానికి భారం గా మారాయి. 

రసాయన ఎరువులు నిషేధం ఈ సంక్షోభానికి మరో కారణం . దిగుమతుల నిషేదం సమయం లో ప్రధాని మాట్లాడుతూ రసాయన ఎరువులు నిషేధం వలన దేశం మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం తో మంచి పంటలు పండుతాయి. అదే సమయం లో మన విదేశీ మారక నిల్వలు కూడా పొదుపు చేసుకోవచ్చు అంతే కాకుండా పర్యావరణం కూడా బావుంటుంది అని అన్నారు.  కానీ వ్యవసాయ శాస్త్ర వేత్తలు ఆహార భద్రత గురించి మరిచిపోకూడదు అని హెచ్చరిస్తునే ఉన్నారు. అనుకున్నట్టు గానే వ్యవసాయ రంగం ఉత్పత్తి 25% కి తగ్గిపోయింది.   దేశం లో వరి ఉత్పత్తి క్రమంగా తగ్గిపోయింది. దేశ ఆర్థిక రంగానికి ఎక్కువ శాతం లో ఆదాయాన్ని చేకూర్చే టీ పంటలు ఉత్పత్తి కూడా దారుణం గా పడిపోయింది. మిరియాలు, దాల్చిన చెక్క , కూరగాయలు వంటి పంట ఉత్పత్తి లు కూడా 30% కి తగ్గిపోయాయి. 
ఆర్గానిక్ వ్యవసాయం పంట ఉత్పత్తులు ను దెబ్బతీసింది. 

ప్రభుత్వం మేలుకొని రసాయన ఎరువులు దిగుమతి మీద నిషేధం ఎత్తివేసే సమయానికి దేశం లో 50%  వ్యవసాయ ఉత్పత్తి మందగించింది. 

ఆహార సంక్షోభం నివారించడానికి మయన్మార్ నుండి  లక్ష టన్నుల బియ్యం ను మయన్మార్ నుండి దిగుమతి చేసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకుంది. అలాగే భారతదేశం నుండి కూడా బియ్యం దిగుమతి చేసుకుంటూ ఉంది. జనవరి లో చైనా మిలియన్ టన్నుల బియ్యాన్ని శ్రీలంక కు పంపింది. 

మరోపక్క రష్యా ఉక్రెయిన్ ల యుద్ధం కూడా శ్రీలంక లో పర్యాటక రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. శ్రీలంక కు వచ్చే విదేశీ యాత్రికులు లో ఎక్కువమంది రష్యా, ఉక్రెయిన్, బెలారస్ దేశాల నుండే వస్తూ ఉంటారు. యుద్ధం వలన ఇప్పుడు ఇక్కడ కు వచ్చేవారు లేరు. 


శ్రీలంక జీడీపీ లో 10% పర్యాటక రంగం ద్వారా నే వస్తుంది. 

2019 లో 7.5 బిలియన్ డాలర్ల ఉన్న పర్యాటక రంగం ఆదాయం 2020 లో 2.8 డాలర్ల కు తగ్గిపోయింది. 

మరో కీలక మైన అంశం ఏంటంటే సోయాబీన్, గోధుమ వంటి ఉత్పత్తులు ను శ్రీలంక రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. అలాగే టీ ఉత్పత్తులు ప్రదానం గా రష్యా కు, ఉక్రెయిన్ కు  ఎగుమతి చేస్తోంది. ఇప్పటి పరిస్థులలో ఎగుమతులు కూడా ఆగిపోవడం తో . యుద్ధం వలన ఆయిల్స్ ధరలు పెరిగి శ్రీలంక కు భారం గా మారింది. 

మరోపక్క చైనా నుండి అప్పులు తీసుకుని హబంన్ తోట పోర్ట్ , సిలోన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ ల అభివృద్ధి కోసం కేటాయించారు. ఈ అప్పులు కూడా శ్రీలంక కు భారం గా పరిణమించాయి. 

ఈ ఆర్ధిక సంక్షోభం నుండి  బయటపడడానికి శ్రీలంక ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళికలు లేవు. రెండు సార్లు కాబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఈ సంక్షోభం నుండి బయట పడడానికి   ఎటువంటి  నిర్ణయాలు తీసుకోలేదు. 

శ్రీలంక సహాయం కోసం ఇప్పుడు భారతదేశం చైనా ను ఆశ్రయించింది. మార్చ్ 17 న శ్రీలంక ఆర్ధిక శాఖ మంత్రి బాసిల్ రాజ పక్స ఢిల్లీ వచ్చినప్పుడు భారతదేశం మిలియన్ డాలర్స్ క్రెడిట్ లైన్ ను జారీచేసింది. శ్రీలంక ఈ డబ్బుతో నిత్యావసరాలు, మందులు కోసం కేటాయించాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకే చైనా కూడా శ్రీలంక కు బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను అందించింది. 

కొలంబో సహాయం కోసం IMF ను కూడా ఆశ్రయించింది. 

ఈ ఆర్ధిక సంక్షోభం నుండి బయట పడడానికి శ్రీలంక కొత్త ఆర్థిక విధానాలు అమలు చేయాల్సి ఉంటుంది. క్రమ బద్ధమైన ప్రణాళికలు పాటించని వ్యస్థలు అయినా వ్యక్తులు కు ఐనా ఎలా పతనం అవుతారు అనే దానికి శ్రీలంక ఒక ఉదాహరణ. 
 
 

Post a Comment

Previous Post Next Post