భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) క్రెడిట్ కార్డ్ వినియోగ దారులకు ఒక శుభవార్త చెప్పింది. ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అప్లికేషన్స్ లో క్రెడిట్ కార్డ్ లను కూడా జత చేసుకోవచ్చు అని ప్రకటించింది. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. మొదటగా రూపే క్రెడిట్ కార్డ్ లను upi విధానం ద్వారా వాడుకోవడానికి అవకాశం కల్పిస్తునట్టు RBI గవర్నర్ శక్తికాంత దాస్ జూన్ 8న ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల పరిధి ని పెంచడం దీని యొక్క లక్ష్యం అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీని ద్వారా వినియోగదారులకు చెల్లింపులు మరింత సౌకర్యం గా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం సేవింగ్ బ్యాంకు అకౌంట్ లను, కరెంటు బ్యాంకు అకౌంట్ లను, డెబిట్ కార్డ్ లను upi లకు అనుసధానం చేసి చెల్లిపులు చేయడానికి అవకాశం ఉంది. upi వ్యవస్థ అత్యంత ప్రజారణ పొందిన వ్యవస్థ గా గుర్తింపు పొందింది. 26 కోట్ల మంది వినియోగదారులు ప్రస్తుతం ఈ upi వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. గడిచిన నెలలో 10.40 కోట్ల లావాదేవీలు ఈ upi వ్యవస్థ ద్వారా జరిగాయి. 594.63 కోట్ల రూపాయలు ఈ విధానం ద్వారా బదిలీ జరిగాయి. ఈ upi వ్యవస్థను ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ లను upi కు జత చేయడానికి నిర్ణయం తీసుకుంది అని ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.
upi కు క్రెడిట్ కార్డ్ లు జత చేయడం వలన ప్రయోజనం ఉందా ?
UPI చెల్లింపుల కోసం మొదట బ్యాంకు అకౌంట్ లు మాత్రమే అనుమతించబడ్డాయి. తరువాత డెబిట్ కార్డు లను కూడా జత చేసి చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పించారు.
ఇకపై వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌లను Google Pay, Paytm, PhonePe వంటి UPI అప్లికేషన్లకు కూడా జత చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌లను జత చేసిన తర్వాత, వినియోగదారులు QR కోడ్‌ని స్కాన్ చేసి, క్రెడిట్ కార్డ్‌ని చెల్లింపు మోడ్‌గా ఎంచుకోవాలి.
UPI అత్యంత సౌకర్యం గా ఉండడం వలన ప్రజాదరణ పొందిన చెల్లింపు పద్ధతిగా మారింది. ఇకపై ఈ కొత్త మార్పుతో, వినియోగదారులు డెబిట్, క్రెడిట్ కార్డు ల నుండి వివిధ చిన్న మరియు పెద్ద బిల్లులకు చెల్లింపు చేసే సౌలభ్యాన్ని పొందుతారు, ”అని ఫినాలజీ వెంచర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రాంజల్ కమ్రా అన్నారు.
మీరు UPI లావాదేవీల కోసం మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చా?
రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మాత్రమే తమ కార్డ్‌లను UPI ప్లాట్‌ఫారమ్‌లకు లింక్ చేయగలరు.
RuPay నెట్వర్క్ మరియు UPI రెండూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చే నిర్వహించబడుతున్నాయి . “అవసరమైన సిస్టమ్ డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అవసరమైన సూచనలు ఎన్పిసిఐకి విడిగా జారీ చేయబడతాయి" అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి ఇతర క్రెడిట్ కార్డ్‌ల కు ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించడానికి కొంత సమయం పట్టవచ్చు.
UPI-క్రెడిట్ కార్డ్ లింక్ చేయడం వ్యాపారులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
UPI మరియు క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానం చిన్న వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు తెలియ చేస్తున్నారు. PhonePe, Paytm, BharatPe వంటి వాటిని వినియోగించే వినియోగదారులు కూడా ప్రయోజనం కలుగుతుంది. కార్డ్‌లు ఇప్పుడు అన్ని రకాల QR కోడ్లలో చెల్లించడానికి అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ ఛార్జీల ద్వారా UPI చెల్లింపు:
UPI చెల్లింపులను క్రెడిట్ కార్డు ద్వారా చేయడం ద్వారా ఎటువంటి చార్జీ లను రిజర్వు బ్యాంకు ఇప్పటివరకు ప్రకటించలేదు. UPI ప్లాట్‌ఫారమ్‌లకు క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి బ్యాంకులు లేదా రుణదాతలు నామమాత్రపు రుసుమును వసూలు చేయవచ్చు.
Post a Comment